తెలంగాణ

telangana

అమెరికాలో కరోనా ఉగ్రరూపం- చైనాలో ఇళ్లకు తాళాలు

By

Published : Aug 12, 2021, 10:40 AM IST

అగ్రరాజ్యంలో కరోనా ఉగ్రరూపు దాల్చింది. 24 గంటల వ్యవధిలో 1.43 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, డెల్టా వ్యాప్తితో అప్రమత్తమైన చైనా.. అక్కడి ప్రజలను బయటకు రాకుండా బలవంతపు చర్యలకు దిగింది. ఇళ్లకు తాళాలు వేస్తోంది.

world covid cases
కరోనా కేసులు

అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా లక్షా 43 వేల 459 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 614 మంది మరణించారు. ఏడు రోజుల సగటు కేసుల సంఖ్య 1.20 లక్షలుగా ఉంది.

అటు.. అగ్రరాజ్యంలోని అనేక రాష్ట్రాలు కొవిడ్​తో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. లూసియానాలోని చాలా ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. అయితే, కేసులు ఇప్పుడే తీవ్ర స్థాయికి చేరలేదని నిపుణులు చెబుతున్నారు. రెండు, మూడు వారాల్లో కరోనా మరింత తీవ్రరూపు దాల్చే అవకాశం ఉందని చెప్పారు.

లూసియానాలో కరోనా వ్యాక్సినేషన్ సైతం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అమెరికాలో అత్యంత తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న రాష్ట్రాల్లో లూసియానా నాలుగో స్థానంలో ఉంది. కేవలం 37శాతం మంది స్థానికులు రెండు డోసుల టీకాను తీసుకున్నారు.

చైనాలో ఇళ్లకు తాళాలు

మరోవైపు, చైనాలోనూ కరోనా తీవ్రంగా ఉంది. డెల్టా వ్యాప్తితో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రజలను బయటకు రానీయకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తైవాన్​లో అయితే ప్రజలను ఇంట్లోనే ఉంచి బలవంతంగా తలుపులకు తాళాలు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ప్రజలు ఒకరోజులో మూడు సార్లకు మించి తలుపులను తెరిస్తే.. వారి ఇళ్లకు తాళాలు వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నట్లు వీడియోలో రికార్డయ్యాయి.

గేటుకు తాళం వేస్తున్న అధికారులు

చైనా నేషనల్ హెల్త్ కమిషన్ గణాంకాల ప్రకారం ఆగస్టు 9న 17 రాష్ట్రాల్లో 143 కేసులు నమోదయ్యాయి. జనవరి 20 తర్వాత ఇదే అత్యధికం. కొత్త కేసుల్లో 108 స్థానికంగా బయటపడగా.. 37 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలో వెలుగుచూశాయి.

మరణ మృదంగం

మరోవైపు, ఇరాన్​లో 42,541 కరోనా కేసులు బయటపడ్డాయి. 536 మంది మరణించారు. ఇండోనేసియా, బ్రెజిల్​ దేశాల్లో కరోనా మృత్యువిలయం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో ఇండోనేసియాలో 1,579 మంది మరణించగా.. బ్రెజిల్​లో 1,123 మంది ప్రాణాలు కోల్పోయారు.

పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా ఉన్నాయి....

దేశం/ప్రపంచంమొత్తం కేసులుకొత్త కేసులుమొత్తం మరణాలు
ప్రపంచం 205,458,743 7,00,607 43,36,669
అమెరికా 3,70,55,916 1,43,459 6,35,636
ఇరాన్ 4,281,217 42,541 95,647
బ్రెజిల్ 2,02,49,176 35,788 5,66,013
ఫ్రాన్స్ 6,370,429 30,920 1,12,410
ఇండోనేసియా 37,49,446 30,625 1,12,198
బ్రిటన్ 61,46,800 29,612 1,30,607
టర్కీ 59,96,224 27,356 52,565
రష్యా 65,12,859 21,571 1,67,241
థాయ్​లాండ్ 8,16,989 21,038 6,795

ఇదీ చదవండి:ప్రపంచంపై 'డెల్టా' పడగ- ఇండోనేసియాలో వైరస్​ విలయం

ABOUT THE AUTHOR

...view details