తెలంగాణ

telangana

శ్వేతసౌధం మీడియా కార్యదర్శికి కరోనా

By

Published : Oct 6, 2020, 4:51 AM IST

శ్వేతసౌధంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మీడియా కార్యదర్శి కేలీ మెకెననీకి తాజాగా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ట్రంప్​ దంపతుల తర్వాత శ్వేతసౌధంలో కరోనా బారిన పడ్డ ఉన్నత ర్యాంకు అధికారుల్లో మెకెననీ ఒకరు.

White House press secretary has coronavirus
శ్వేతసౌధం మీడియా కార్యదర్శికి కరోనా

అమెరికా అధ్యక్ష భవనాన్ని కరోనా చుట్టేస్తోంది. తాజాగా శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కెేలీ మెకెననీకీ కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. దీంతో వెంటనే క్వారంటైన్​లోకి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు.

" ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రజలకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. క్వారంటైన్​లో ఉంటూ అమెరికా ప్రజల కోసం పనిచేస్తా"

-కేలీ మెకెననీ.

లక్షణాలు లేకపోయినా సోమవారం నిర్వహించిన పరీక్షల్లో తనకు కొవిడ్​ నిర్ధరణ అయ్యిందని కేలీ తెలిపారు. అయితే ప్రెస్​ విభాగంలోని ఉద్యోగులకు మాత్రం నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కేలీ త్వరగా కోలుకోవాలని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details