తెలంగాణ

telangana

US Covid deaths: అమెరికాలో మృత్యు కేకలు.. రోజూ 2వేల మరణాలు

By

Published : Sep 19, 2021, 10:42 PM IST

అమెరికాలో కరోనా (US Covid cases) విలయం సృష్టిస్తోంది. కేసులు తగ్గినా.. మరణాల సంఖ్య (US Covid deaths) గణనీయంగా నమోదవుతోంది. గడిచిన వారంలో ప్రతిరోజు సగటున రెండు వేలకు పైగా కొవిడ్ బాధితులు మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. (New York Times Covid)

us covid cases
అమెరికా కరోనా కేసులు

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు (US Covid cases) తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ (US vaccination rate) ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా (US Covid deaths) మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్‌తో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌' (New York Times Covid) వెల్లడించింది. గడిచిన వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతిచెందినట్లు తెలిపింది. (US Covid 7 day average deaths)

కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా (covid cases in US states) నుంచి అధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో సెప్టెంబర్‌ 13న 2.85 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఈ శుక్రవారం 1.65 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌ (Delta Covid cases in US) కారణంగానే భారీ స్థాయిలో జనం వైరస్‌ బారిన పడుతున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (CDC US Covid cases) వెల్లడించింది. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మొదటి డోసు తీసుకున్నారు.

ఇదీ చదవండి:US drone strike: అమెరికా చివరి దాడి గురి తప్పిందిలా!

ABOUT THE AUTHOR

...view details