తెలంగాణ

telangana

ఐరాస చీఫ్​ ఎన్నికకు రంగం సిద్ధం

By

Published : Jan 16, 2021, 10:34 AM IST

Updated : Jan 16, 2021, 12:40 PM IST

ఐరాస సెక్రటరీ జనరల్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల వివరాలను తెలపాలని యూఎన్​లోని 193 దేశాధినేతలకు లేఖ రాయనుంది ఐరాస. అయితే రెండోసారి ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధమని ప్రస్తుత చీఫ్​ ఆంటోనియో గుటెరస్ ఇదివరకే స్పష్టం చేశారు.

UN hopes to take first step to elect next chief by Jan 31
యూఎన్ ప్రధాన కార్యదర్శి ఎన్నికకు రంగం సిద్ధం

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు యూఎన్​ జనరల్​ అసెంబ్లీ సిద్ధమైంది. ఎన్నికలో పోటీ చేసే.. అభ్యర్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. కౌన్సిల్​ అధ్యక్షుడు తారిక్​ లాడేబ్​ యూఎన్​లోని 193 దేశాల అధినేతలకు లేఖ రాయనున్నారు. జనవరి 31లోపు లేఖలు పంపనున్నట్లు యూఎన్​ అధ్యక్షుడు వోల్కాన్​ బోజ్​కిర్​ తెలిపారు. భద్రతామండలిలోని 15మంది సభ్యుల సిఫార్సు అనంతరం.. యూఎన్​ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. అయితే ఐక్యరాజ్యసమితిలో వీటో పవర్​ ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాల మద్దతు కీలకం కానుంది. ఇప్పటికే బ్రిటిష్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​కు తన మద్దతు తెలిపారు. కానీ మిగతా నాలుగు దేశాలు దీనిపై స్పందించలేదు.

ప్రధాన కార్యదర్శి ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు... రానున్న ఐదు ఏళ్లలో తమ లక్ష్యాలను కౌన్సిల్​కు తెలపాలని అధ్యక్షుడు వోల్కాన్​ బోజ్​కిర్ అన్నారు. అనంతరం ప్రశ్న-జవాబు కార్యక్రమం ఉంటుందన్నారు. అయితే అభ్యర్థులను ప్రకటించటానికి సభ్య దేశాలకు ఎలాంటి గడువులేదన్నారు.

ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు అనుమతిస్తే..తాను రెండోసారి పదవిలో కొనసాగుతానని ప్రస్తుత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇదివరకే యూఎన్ అధ్యక్షుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గుటెరస్ 2017, జనవరి 1 న ఎన్నికయ్యారు.

ఇదీ చదవండి :మరోసారి ఆ పదవిలో కొనసాగుతా: గుటెరస్​

Last Updated : Jan 16, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details