తెలంగాణ

telangana

'ఎన్నికల్లో మోసం'పై సుప్రీంకు వెళ్తాం: ట్రంప్

By

Published : Nov 4, 2020, 1:26 PM IST

అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తనకు సంబంధించినంత వరకు ఇప్పటికే తాము గెలిచామని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

trump
ట్రంప్

ఎన్నికల్లో గెలుపు లాంఛనమేనని, భారీ విజయోత్సవానికి సిద్ధం కావాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా తనకు భారీగా మద్దతుగా నిలిచిన దేశ ప్రజలు, కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఓటింగ్​, లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. శ్వేత సౌధంలో ట్రంప్ ప్రసంగించారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో లెక్కింపు జరుగుతోందని.. పెన్సిల్వేనియా, నార్త్​ కరోలైనా, మిషిగన్, జార్జియాల్లో విజయం తథ్యమని అన్నారు ట్రంప్.

సుప్రీంకోర్టుకు..

అయితే, ఎన్నికల్లో మోసం జరుగుతోందని ఆరోపించిన ట్రంప్.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

"దేశంలో ఎన్నికలపై భారీ మోసం జరగనుంది. ఈ విషయంపై మేం సుప్రీంకోర్టులో పోరాడతాం. ఉదయం 4 గంటలకు కూడా బ్యాలెట్లను స్వీకరించి, లెక్కల్లోకి తీసుకుంటే అంగీకరించం. నాకు సంబంధించిన వరకు ఇప్పటికే మేం గెలిచాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి:ట్రంప్​ X బైడెన్: గెలుపు మాదంటే మాదేనని..

ABOUT THE AUTHOR

...view details