తెలంగాణ

telangana

అమెరికాలో విమాన ప్రమాదం- భారత సంతతి వైద్యుడు మృతి

By

Published : Oct 12, 2021, 1:18 PM IST

అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వైద్యుడు విమాన ప్రమాదంలో (US plane crash) మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో మరొక వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారు. (California plane crash)

PLANE CRASH
అమెరికా ప్లేన్ క్రాష్

విమాన ప్రమాద దృశ్యాలు

భారత సంతతి కార్డియాలజిస్ట్​కు చెందిన విమానం (US plane crash) అమెరికాలోని కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో కార్డియాలజిస్ట్ సుగతా దాస్ సహా ఇద్దరు మరణించారు (Indian dead in US). విమాన ప్రమాదం తర్వాత చెలరేగిన మంటల్లో సమీపంలోని రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. మరికొన్ని నివాసాలు, వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు.. మంటలు మరింత వ్యాపించకుండా నిలువరించాయి.

ధ్వంసమైన నివాసాలు
.

సాంటీ ప్రాంతంలోని సాటానా హైస్కూల్ సమీపంలో విమానం పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మరణించిన మరొక వ్యక్తిని యునైటెడ్ పార్సిల్స్ సర్వీస్​కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. (US plane crash)

మంటలను ఆర్పేసిన తర్వాత ఇలా...

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఘటన (California plane crash) జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. విమానాన్ని 'సెస్నా సీ340' రకానికి (Cessna plane crash today) చెందినదిగా గుర్తించింది. విమానంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియదని పేర్కొంది.

ఇద్దరు కుమారులు..

బెంగాలీ కుటుంబంలో జన్మించిన దాస్.. పుణెలో పెరిగారు. ప్రస్తుతం అరిజోనాలో నివసిస్తున్నారు. పవర్ ఆఫ్ లవ్ ఫౌండేషన్​ అనే స్వచ్ఛంద సంస్థకు డైరెక్టర్​గానూ వ్యవహరిస్తున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధిత మహిళలు, చిన్నారులకు ఇది సహాయం అందిస్తుంది.

లవ్ ఫౌండేషన్ వెబ్​సైట్ వివరాల ప్రకారం దాస్​కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అరిజోనాలోని యూమా రీజనల్ మెడికల్ సెంటర్​లో కార్డియాలజిస్ట్​గా పనిచేస్తున్నారు. ఆయనకు చిన్నపాటి ట్విన్ ఇంజిన్ విమానం ఉంది. ప్రమాదంలో ఇదే విమానం ధ్వంసమైంది.

సెస్నా సీ340ని సాధారణంగా వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఆరుగురు ప్రయాణించే వీలుంటుంది.

ఇదీ చదవండి:'కృత్రిమ మేధ పోరులో అమెరికాపై చైనాదే పైచేయి'

ABOUT THE AUTHOR

...view details