తెలంగాణ

telangana

ఉత్తర కొరియాకు చైనా, రష్యా వత్తాసు- ఆంక్షలకు మోకాలడ్డు!

By

Published : Jan 21, 2022, 9:37 AM IST

UN sanctions on N Korea: ఉత్తర కొరియా అధికారులపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలిలో చైనా, రష్యా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించాలని అమెరికా పిలుపునివ్వగా.. చైనా దీనిపై మౌనం వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

China Russia block US bid to sanction North Korea at UN
China Russia block US bid to sanction North Korea at UN

UN sanctions on N Korea: అగ్రరాజ్యానికి హెచ్చరికలు చేస్తూ వరుస క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాపై కొరడా ఝులిపించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన ప్రతిపాదనకు చైనా, రష్యా మోకాలడ్డాయి. ఇటీవలి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగానికి సంబంధించి ఐదుగురు ఉత్తర కొరియా అధికారులపై ఆంక్షలు విధించాలని ఐరాస భావించగా.. చైనా, రష్యా వ్యతిరేకించాయి.

US sanctions on North Korea:

కిమ్ దేశం చేపట్టిన క్షిపణి ప్రయోగాల్లో ఈ అధికారుల హస్తం కీలకంగా ఉందని ఐరాస భావిస్తోంది. గత రెండు వారాల వ్యవధిలో నాలుగు బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో.. ఈ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి గురువారం సమావేశం నిర్వహించింది. శాశ్వత, తాత్కాలిక సభ్యులుగా ఉన్న 15 దేశాలకు ఆహ్వానం పంపింది.

North Korea Missile tests

ఉత్తర కొరియా చేపట్టిన చర్యలు భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్​ఫీల్డ్ పేర్కొన్నారు. ఈ వ్యవహార తీరు అంతర్జాతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. పరిస్థితుల తీవ్రత తగ్గించేలా చర్చలకు రావాలని ఆ దేశానికి పిలుపునిచ్చారు.

అల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, యూఏఈ, యూకే దేశాలు అమెరికా తీర్మానానికి మద్దతిచ్చాయి. ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవడంలో భద్రతా మండలి సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలని పేర్కొన్నాయి.

బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే..

అయితే, ఈ సమావేశంలో ఉత్తర కొరియాపై మాట్లాడేందుకు చైనా నిరాకరించిందని భేటీలో పాల్గొన్న కొందరు దౌత్యవేత్తలు తెలిపారు. దీనిపై స్పందించిన అమెరికా ప్రతినిధి గ్రీన్​ఫీల్డ్.. ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం అంటే.. ఆ దేశానికి బ్లాంక్ చెక్ ఇచ్చినట్టేనని విమర్శించారు.

కిమ్ తగ్గేదే లే

North Korea Nuclear test:ఉత్తర కొరియా ఇటీవల ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. జనవరిలోనే నాలుగు రౌండ్ల మిసైల్ పరీక్షలు నిర్వహించింది. రైలు నుంచీ క్షిపణులను ప్రయోగించింది. తమ దేశాన్ని అమెరికా శత్రుస్వభావంతో చూస్తోందని, ఈ నేపథ్యంలో.. అణు పరీక్షలు ముమ్మరం చేస్తామని ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన చర్చల తర్వాత తాత్కాలికంగా నిలిపివేసిన కార్యకలాపాలన్నింటినీ పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీర్ఘశ్రేణి క్షిపణులు, అణుబాంబులను తయారు చేస్తామని ఈ మేరకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:అమెరికాకు 'కిమ్' షాక్.. అణు పరీక్షలపై ఇక 'తగ్గేదే లే'!

ABOUT THE AUTHOR

...view details