తెలంగాణ

telangana

Afghan Crisis: అఫ్గాన్​లో ఆకలి సంక్షోభం- నిండుకున్న ఆహార నిల్వలు!

By

Published : Sep 2, 2021, 10:16 AM IST

ఆకలి కేకలతో అఫ్గానిస్థాన్(Afghanistan Crisis) విలవిల్లాడుతోంది. కోట్లాది మందికి ఆహారం దక్కని పరిస్థితి(Afghanistan Hunger Crisis) తలెత్తింది. దేశంలోని కరవుకు తోడు.. తాలిబన్ల దురాక్రమణతో(Afghanistan news) అఫ్గాన్ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. అరకొరగా ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటితే.. పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

afghanistan hunger crisis
అఫ్గానిస్థాన్ ఆహార సంక్షోభం

తాలిబన్ల చెరలో(Afghanistan Taliban) చిక్కుకొని అల్లాడుతున్న అఫ్గాన్‌ ప్రజలకు ఆకలి దప్పుల(Afghanistan Food and Hunger) రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఉన్న ఆహార నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన సీనియర్‌ అధికారి రమిజ్ అలాక్బరోవ్ తెలిపారు. ఇప్పటికే దేశంలోని మూడోవంతు మంది ప్రజలు ఆహార సమస్య(Afghanistan Hunger Crisis) ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 3.8కోట్ల మంది రోజూ ఆహారం తీసుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు.

అఫ్గాన్‌లో అరకొరగా ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటితే.. పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముందని రమిజ్ అలాక్బరోవ్ హెచ్చరించారు. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వేలాది మంది అఫ్గాన్‌లకు ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే రానున్న రోజుల్లో ఆహార సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటం వల్ల.. ఆహార సరఫరాకు దాదాపు 200 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. ఆకలి బాధలు చిన్నారుల్లోనే అధికంగా ఉందని ఐరాస అధికారి పేర్కొన్నారు.

"సగానికి పైగా చిన్నారులు ఈ రోజు రాత్రి ఆహారం తీసుకుంటారో లేదో తెలియదు. క్షేత్రస్థాయిలో మేం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి ఇది. ఈ చిన్నారులకు ఆహారం అందించే పరిస్థితి లేదు. ఔషధాల కొరత ఉంది. బడ్జెట్ పరిమితుల కారణంగా.. సోషల్ సెక్టార్ కార్మికులు, టీచర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉంది."

-రమిజ్ అలాక్బరోవ్, ఐరాస అధికారి

గుటెరస్ ఆవేదన

అమెరికా బలగాలు అఫ్గాన్​ను(Afghanistan US Troops) వీడిన వేళ.. దేశంలో తలెత్తిన మానవతా సంక్షోభంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్(UN on Afghanistan Crisis) ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్​లోని సగం జనాభా అయిన సుమారు కోటి 80 లక్షల మందికి అత్యవసర సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

"ముగ్గురు అఫ్గాన్ పౌరుల్లో ఒకరికి తాము తర్వాతి భోజనం ఎలా చేస్తామని తెలియడం లేదు. ఐదేళ్లలో పిల్లల్లో సగం మంది వచ్చే ఏడాది నాటికి పూర్తిగా పోషకాహార లోపం బారిన పడతారు. గతంలో ఎప్పుడూ లేనంతగా.. అఫ్గాన్ చిన్నారులు, మహిలలకు అంతర్జాతీయ సహకారం అవసరం. వీరికి మద్దతు అందించి, నిధులు సమకూర్చాలని అన్ని దేశాలను అభ్యర్థిస్తున్నా."

-ఆంటోనియో గుటెరస్, ఐరాస చీఫ్

అఫ్గాన్ తాలిబన్ల వశమైన తర్వాత 15 రోజుల్లో 80 వేల మందికి ఆహారం అందించినట్లు గుటెరస్ వివరించారు. కుటుంబాలకు దూరమైన వేలాది మందికి సహాయం చేసినట్లు చెప్పారు. బుధవారం 12.5 మెట్రిక్ టన్నుల ఔషధాలను అఫ్గాన్​కు వాయుమార్గంలో పంపినట్లు వెల్లడించారు. ఓవైపు కరవు, మరోవైపు చలి తీవ్రత కారణంగా.. అదనపు ఆహారం, ఔషధాలు, షెల్టర్లు వేగంగా ఏర్పాటు చేయాలని అన్నారు.

ఇదీ చదవండి:అఫ్గాన్​పై ఆకలి రక్కసి- పెనం పై నుంచి పొయ్యిలోకి..

ABOUT THE AUTHOR

...view details