తెలంగాణ

telangana

వయసు ఏడాదే.. నెలకు రూ. 75 వేల సంపాదన

By

Published : Oct 21, 2021, 12:32 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇన్​ఫ్లూయెన్సర్ల (Baby influencer) హవా నడుస్తోంది. అదే వారికి కనకవర్షం కురిపిస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి ఏడాది వయసున్న ఓ చిన్నారి చేరాడు. నెలకు రూ. 75 వేలు ఆర్జిస్తున్నాడు. ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అసలీ కథేంటో తెలుసుకుందాం.

1-year-old influencer baby earns Rs 75,000 almost every month by travelling
వయసు ఏడాదే.. నెలకు రూ. 75 వేల సంపాదన

ప్రపంచం అరచేతిలోకి వచ్చాక సంపాదనకు(Baby influencer) బోలెడన్ని దారులు తెరుచుకున్నాయి. ఇంట్లో కూర్చొనే రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కొత్త కొత్త ప్రొఫెషన్స్​.. ఊహించనంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఉద్యోగాలుగా అనిపించని అలాంటి ఓ వింత కొలువుతో.. నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు. అదీ ఏడాది వయసున్న చిన్నారి కావడం మరింత ప్రత్యేకం.

చేసే పనేంటంటే?

దేశాలు పర్యటించడం (Baby travel). ఇదేంటి అనుకుంటున్నారా. అవును.. అమెరికాకు చెందిన బేబీ బ్రిగ్స్​(Baby influencer) ఇప్పటికే 45 సార్లు విమాన ప్రయాణం చేశాడు. అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టొచ్చాడు. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఉటావాల్లోని పార్కులు, బీచ్​ల్లోనూ తిరిగాడు.

బేబీ బ్రిగ్స్​తో జెస్​

అసలు దీనికి డబ్బులెలా ఇస్తారని ఆలోచిస్తున్నారా? అసలు సంగతి ఇక్కడే ఉంది. చిన్న పిల్లలతో విమానయానం సహా ఇతర ప్రయాణాలు చేయడం ఎలా అనేదే ఇందులో చూపిస్తారు.

దేశాలు చుట్టేస్తున్న బేబీ బ్రిగ్స్​

ఇన్​స్టాగ్రామ్​లో(Instagram Influencer)బ్రిగ్స్​కు 30 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతని పేరిట పార్ట్​ టైమ్​ టూరిస్ట్స్​ అనే ఒక బ్లాగ్​ కూడా నడిపిస్తోందా చిన్నారి తల్లి​ జెస్​. చిన్నారితో దేశాలు చుట్టి.. సంబంధిత వీడియోలను సోషల్​ మీడియాలో షేర్​ చేయడం ఆమె పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఇలా సగటున నెలకు రూ. 75 వేలకుపైనే ఆదాయం వస్తోంది.

''2020లో నేను గర్భిణీగా ఉన్నప్పుడు నా జీవితం అయిపోయిందని ఘోరంగా బాధపడ్డా. నేను బిడ్డకు జన్మనివ్వగలనా, నాకు ఇది సాధ్యమేనా అనే అనుమానం కలిగింది.''

- జెస్​

కరోనా మహమ్మారి.. మనం జాగ్రత్తగా ఉండాలని నేర్పించింది. అప్పుడు వైరస్​ వ్యాప్తి చెందకుండా దాదాపు అన్ని దేశాలు లాక్​డౌన్​లు కూడా విధించాయి. ఆ సమయంలోనూ.. చిన్నారితో(Baby influencer) జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయడం ఎలానో చేసి చూపించారు జెస్​. తొలిసారి తల్లిదండ్రులయ్యే వారికి ఇలాంటివి ఉపకరిస్తాయని అంటున్నారు.

''నేను, నా భర్త ఏదైనా పని చేయాలనుకున్నాం. చిన్నారుల ప్రయాణాలపై మాట్లాడుకోవడం వంటివి సోషల్​ మీడియాలో ఏమైనా ఉన్నాయా అని చూశా. ఒక్కటీ కనిపించలేదు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా. నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటీ పంచుకోవాలని. తొలిసారి తల్లిదండ్రులయ్యే వారికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి.''

- జెస్​

ఇప్పుడు ఐరోపాలో పర్యటించాలని(Baby influencer) జెస్​ కుటుంబం భావిస్తోంది. లండన్​కు(Baby travel) తప్పక వెళ్తామని జెస్​ తెలిపింది.

సాఫ్ట్​వేర్​ రంగానికి దీటుగా.. ఆధునిక ప్రపంచంలో ఎక్కువ వేతనాలు ఇచ్చే అనేక ప్రొఫెషన్స్ (Instagram Influencer) ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు అసలు చేసినట్లుగా ఉండవు.. కానీ ఆ పనులకు భారీగా వేతనాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగాలు వాటి వేతనాల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి:ఈమె మనిషి కాదు.. కానీ సంపాదన మాత్రం కోట్లలో!

ABOUT THE AUTHOR

...view details