తెలంగాణ

telangana

అప్పుడు ఓ సాధారణ డ్రైవర్​.. ఇప్పుడు కామెడీ స్టార్​.. కానీ ఆ ఇబ్బందులతో..

By

Published : Jun 8, 2022, 6:03 PM IST

Updated : Jun 8, 2022, 6:55 PM IST

Bullet Bhaskar Jabardast: బుల్లితెరపై 'జబర్దస్త్'​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బుల్లెట్​ భాస్కర్, అతని తండ్రి. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన వీరు.. తమకు దక్కిన గుర్తింపుపై హర్షం వ్యక్తం చేశారు. ఇంకా పలు ఆసక్తికర సంగతులు తెలిపారు. ఆ విశేషాలివీ..

Bullet Bhaskar father
బుల్లెట్ భాస్కర్​ తండ్రి

బుల్లెట్ భాస్కర్​ తండ్రి

Bullet Bhaskar Jabardast: బుల్లెట్​ భాస్కర్​.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. 'జబర్దస్త్'​ కార్యక్రమం ద్వారా ఓ సాదా సీదా కమెడియన్​ నుంచి టీమ్​ లీడర్​గా ఎదిగి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలానే ఈ షో ద్వారా తనే కాకుండా అతడి తండ్రి కూడా ఓ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫాదర్స్​ డే సందర్భంగా.. గెస్ట్​గా వచ్చిన ఆయన తనదైన స్టైల్​లో కామెడీ పండించి తనలోని ఆర్టిస్ట్​ను బయటపెట్టారు. స్కూలు పిల్లాడిగా ఆయన పోషించిన పాత్ర, వేసిన పంచ్​లు తెగ నవ్వులు పూయించాయి. ఆ తర్వాత పలు స్క్రిప్ట్​లలో భాగస్వామ్యమై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​ బుల్లెట్ భాస్కర్​ను, అతడి తండ్రిని ప్రత్యేకంగా పలకరించింది. ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరూ తమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. సామాన్య వ్యక్తి నుంచి స్టార్​గా ఎదగడం ఎంతో గొప్పగా ఉందని చెప్పిన వీరు.. సెలబ్రిటీ కష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చారు.

"మా నాన్నను తీసుకురావడం ఓ మధుర జ్ఞాపకం. కమెడియన్​గా ఆయన రాలేదు. ఫాదర్స్​డేన గెస్ట్​గా ఆయన్ను తీసుకురమ్మన్నారు. ఆయన టైమింగ్​ నేచురల్​గా ఉండటం వల్ల మంచి పేరు వచ్చింది. కానీ ఆయన ఇబ్బంది పడుతున్నాడు. సెలబ్రిటీల కష్టాలు పడుతున్నాడు. 'అరె ఎందుకురా టీవీలోకి తీసుకెళ్లావ్, ఎక్కడపడితే అక్కడ ఆపి ఫొటోలు అడుగుతున్నారు' అని అంటున్నారు. బయట మనల్ని నలుగురు గుర్తుపట్టి ఫొటోలు అడుగున్నారంటే ఎంతో గర్వంగా ఉంటుంది. అది అనుభవించే వాడికి తెలుస్తుంది. ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇలాంటి భాగ్యం దొరుకుతుంది." అని భాస్కర్ అన్నారు.

"ఫాదర్స్​ డే రోజు రమ్మన్నారు అంటే వచ్చాను. మేం స్కూలు పిల్లలుగా యాక్టింగ్​ చేశాం. వారు ఇచ్చిన నాలుగు డైలాగ్​లు​ బాగా చెప్పాను. ఎందుకంటే నేను బస్ డ్రైవర్​ను. నాలుగు చోట్ల తిరుగుతుంటాను. అందరితో మాట్లాడుతా ఉంటా. అలానే డైలాగ్​లు కూడా మామూలుగా చెప్పేశాను. ఆ తర్వాత క్యాష్​ ప్రోగ్రాంకు వెళ్లాను. అక్కడికి వెళ్లినప్పుడు నేను మాట్లాడిన మాటలకు.. డైరెక్షన్​ డిపార్ట్​మెంట్​ వాళ్లు మెచ్చుకున్నారు. ఇందులోనే కంటిన్యూ అయిపోమన్నారు. ఇక నా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఇది చేస్తూనే డ్రైవింగ్​ కూడా చేస్తాను." అని బుల్లెట్​ భాస్కర్​ తండ్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: విజయ్​- వంశీ పైడిపల్లి సినిమాలో సూపర్​ స్టార్​?

Last Updated : Jun 8, 2022, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details