తెలంగాణ

telangana

మాస్కు తీయమంటే తీయవేం.. అందం తరిగిపోద్దనా!

By

Published : Oct 12, 2022, 5:00 PM IST

మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లారు నటి రష్మిక. తిరిగి వచ్చిన ఆమెను చూసిని ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. కానీ రష్మిక మాత్రం వాళ్లు చెప్పింది చేయలేదు. అసలేమైందంటే?

rashmika mandanna spotted at mumbai airport
rashmika mandanna spotted at mumbai airport

నాలుగు రోజుల పాటు మాల్దీవుల్లో సేద తీరి తిరిగి ముంబయికి చేరుకున్నారు నటి రష్మిక. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూసిన ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. "మేడమ్‌ ఎలా ఉన్నారు? దయచేసి ఒక్కసారి మాస్క్‌ తీయండి. ఫొటోలు తీసుకుంటాం" అని కోరగా.. రష్మిక సున్నితంగా తిరస్కరించింది. "క్షమించండి నేను మాస్క్‌ తీయలేను. శరీరం నల్లగా మారిపోయింది. ఇప్పుడు మాస్క్‌ తీస్తే మీరందరూ భయపడతారు" అని నవ్వుతూ సమాధానమిచ్చింది. "మీరు కారులోకి వెళ్లే ముందైనా ఒక్కసారి మాస్క్‌ తీయండి" అని అడగ్గా.. "సారీ.. ఏం అనుకోకండి" అని బదులిచ్చి రష్మిక అక్కడి నుంచి వెళ్లిపోయింది.

బాలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక చిన్న విరామం తీసుకుని టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. మాల్దీవుల టూర్‌లో భాగంగా సముద్రం, ప్రకృతి అందాలకు మైమరచిపోయిన ఆమె.. ఆ ప్రాంతానికి బై చెప్పడం కష్టంగా ఉందని మంగళవారం ఉదయం పోస్ట్‌ పెట్టారు. అయితే, ఈ టూర్‌లో రష్మికతోపాటు నటుడు విజయ్‌ దేవరకొండ సైతం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారం టూర్‌కు వెళ్లే ముందు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది. ఇక, మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన సమయంలోనూ రష్మిక కంటే ముందు ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయ్‌ దేవరకొండే బయటకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details