తెలంగాణ

telangana

Tiger 3 Trailer : కత్రినా కైఫ్​ బాత్​ టవల్​ ఫైట్ సెన్సేషన్​​.. రూ.1000 కోట్లు!

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 5:31 PM IST

Tiger 3 Trailer Katrina Bath Towel Fight : 'టైగర్ 3' ట్రైలర్​లో కత్రినా కైఫ్​ బాత్ టవల్ ఫైట్ సీక్వెన్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్​ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Tiger 3 Trailer Katrina Bath Towel Fight
Tiger 3 Trailer Katrina Bath Towel Fight

Tiger 3 Trailer Katrina Bath Towel Fight : యాక్షన్​ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ 3' ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా సల్మాన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లు, కత్రినా బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కత్రినా బోల్డ్​ టవల్ ఫైట్ సీక్వెన్స్​ బాగా ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది.

సినిమాలో కత్రినా కైఫ్ జోయా అనే పాత్రలో కనిపించింది. ట్రైలర్​లో పలు యక్షన్ సీన్స్​లో ఫైటింగ్​ చేస్తూ, అలానే ఫ్యామిలీ సీన్స్​లో ఆకట్టుకుంది. అయితే ట్రైలర్ చివర్లో​ 5 సెకన్ల పాటు వచ్చిన కత్రిన టవల్​ ఫైట్​ మాత్రం స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. ఇందులో బాత్ టవల్స్​ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్​ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్​గా తమ నేక్డ్​ బాడీని కవర్​ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్... సినిమాపై ఒక్కసారిగా మరింత స్పెషల్ ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేసి నెక్స్ట్​ లెవల్​కు తీసుకెళ్లింది.

దీంతో ఈ సీన్స్​ను చూసిన నెటిజన్లు దానికి సంబంధించిన స్క్రీన్​ షాట్స్​ను షేర్​ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. కత్రిన సీన్​​ కోసమైనా సినిమాను బిగ్​ స్క్రీన్​పై తప్పకుండా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. 'సల్మాన్​ ఖాన్​ ఈ సినిమాపై అందరి దృష్టి పడటానికి, తన బాడీని మేకప్​ చేసుకోవడానికి నెలల తరబడి కష్టపడ్డాడు. కానీ కత్రినా సింపుల్​గా ఒక్క టవల్​ సీన్​తోనే అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుందిగా', 'ఈ ఒక్క సీన్​ టైగర్​ 3కి రూ.1000కోట్లు పక్కా' అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది రణ్​బీర్​ కపూర్ ఐకానిక్ టవల్​ సీన్​ను కత్రిన కాపీ చేసిందిగా' అని చెబుతున్నారు.

జోయ పాత్ర గురించి కత్రిన ఈ విధంగా మాట్లాడింది. "వైఆర్​ఎఫ్​ స్పై యూ నివర్స్​లో జోయానే తొలి మహిళా పాత్ర​. నేను ఈ పాత్ర పోషించినందుకు గర్వంగా భావిస్తున్నాను. జోయా ఎంతో ధైర్యవంతురాలు, క్రూరమైనది. హృదయం, విధేయత, ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి. అన్నింటికన్నా ఎక్కువగా ఆమె ప్రతిసారీ మానవత్వం కోసం నిలబడుతుంది. ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్ లాంటిది" అని కత్రిన పేర్కొంది.

NTR Cameo role : 'సలార్'​ - 'టైగర్​ 3'లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత?

పిల్లలు కావాలి.. కానీ పెళ్లి మాత్రం వద్దు బాబోయ్​!: సల్మాన్​ ఖాన్​

ABOUT THE AUTHOR

...view details