తెలంగాణ

telangana

Nandi Awards : 'వాళ్లెవరూ నంది అవార్డులు ఇవ్వకూడదు!'

By

Published : Aug 4, 2023, 3:30 PM IST

Updated : Aug 4, 2023, 3:38 PM IST

Nandi Awards : దుబాయ్‌ వేదికగా నిర్వహించే నంది అవార్డుల వేడుకకు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి(టీఎఫ్‌సీసీ). నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పేరు మీదే ఉందన్న టీఎఫ్‌సీసీ.. ఆ అవార్డుల వేడుకలపై తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని కోరింది.

nandi awards
nandi awards

TFCC Nandi Awards : నంది అవార్డులపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి(టీఎఫ్‌సీసీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరులో దుబాయ్‌ వేదికగా నిర్వహించే నంది అవార్డుల వేడుకకు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దుబాయ్‌లో జరిగే నంది అవార్డుల వేడుక రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతమని పేర్కొంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో రామకృష్ణగౌడ్ ప్రైవేటు సంస్థగా, వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇస్తున్నారని తెలిపింది.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేదని, అది ఒక ప్రైవేటు సంస్థ అని వివరించింది. నంది పేరుతో అవార్డులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పేరు మీదే ఉందన్న టీఎఫ్‌సీసీ.. అవార్డుల వేడుకలపై తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని కోరింది.

Last Updated :Aug 4, 2023, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details