తెలంగాణ

telangana

'విన్నర్ నేనే, నాకు తెలుసు'- శివాజీ రెమ్యునరేషన్ అన్ని లక్షలా? ప్రశాంత్​ కంటే ఎక్కువ జాక్‌పాట్!

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 8:57 AM IST

Updated : Dec 18, 2023, 11:41 AM IST

Shivaji Bigg Boss 7 Remuneration : బిగ్​బాస్​ తెలుగు సీజన్​-7 రెండో రన్నరప్​గా నిలిచిన శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు విన్నర్​ తానేనని తెలిపారు. మరి ఈ షో ద్వారా శివాజీ ఎంత సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Shivaji Bigg Boss 7 Remuneration
Shivaji Bigg Boss 7 Remuneration

Shivaji Bigg Boss 7 Remuneration :బిగ్​బాస్​ సీజన్-7 ఫినాలే అయిపోయింది. విన్నర్​ కూడాఎవరో తేలిపోయింది. అయితే ఈ సీజన్​లో శివాజీ విన్నర్​ అవుతారని అంతా భావించారు. కానీ అంతా 'ఉల్టా పల్టా' అయింది. శివాజీ బదులు ఆయన శిష్యుడు పల్లవి ప్రశాంత్ గెలిచారు. అయితే తాను విజేత కాలేకపోయాననే బాధ శివాజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫినాలే తర్వాత బిగ్​బాస్ బజ్​లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ బజ్​లో యాంకర్​ గీతూ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో అందిరికీ తెలిసిందే. అందరినీ అడిగినట్లే శివాజీని కూడా ఘాటైన ప్రశ్నలు అడిగేసింది గీతూ. టాప్-3 వరకు వస్తారని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా అని అడిగిన ప్రశ్నకు "టాప్ 3 ఏమిటీ? ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు" అని శివాజీ తెలిపారు. "మరి విన్నర్ మీరే అనుకుంటున్నారు కదా టాప్-3లో ఆగిపోవడానికి కారణం ఏమిటి అనుకున్నారు" అని అడిగింది గీతూ. "ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఆడుతుంటే ఆడనివ్వకుండా చెయ్యాలన్న మొదటి రోజు సంకల్పం నుంచి నేను అడ్డం పడ్డాను" అని తెలిపారు.

'వాళ్ల వెనకాల ఉన్న శక్తి నేను'
"మీ వల్లే యావర్, పల్లవి ప్రశాంత్ ఇంత దూరం వచ్చారని మీరు అనుకుంటున్నారా" అని గీతూ అడిగిన ప్రశ్నకు "కాకపోతే వాళ్ల వెనకాల ఒక శక్తి ఉందని తెలియజేశాను" అని శివాజే సమాధానమిచ్చారు. "ఆడియెన్స్ అందరికీ అమర్‌ను మీరు కావాలనే డే వన్ నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది" అని గీతూ అడగ్గా "నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా అమర్‌ నేను వేరీ గుడ్ ఫ్రెండ్స్" అని శివాజీ అన్నారు. "అసలు బిగ్ బాస్ హౌస్‌కు ఎందుకు వచ్చారు?" అని ప్రశ్నించగా "శివాజీ అంటే బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఎప్పటికైనా గుర్తుండాలి. దట్ ఈజ్ మై మార్క్" అని సమాధానం చెప్పారు.

అయితే బిగ్​బాస్ హౌస్‌లోకి భారీ అంచనాలతో వచ్చి అందుకు తగ్గట్లుగానే సత్తా చాటిన శివాజీ 15వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్​బాస్ నిర్వాహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న విషయం బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం శివాజీ ఒక్కో వారానికి రూ. 4.25 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని తెలిసింది. ఈ లెక్కన రూ.63లక్షలకుపైగా సంపాదించినట్లు సమాచారం.

బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి రూ.35 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. అమర్ దీప్ రన్నరప్‌గా నిలవగా శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. నాలుగో స్థానంలో ఉన్న యావర్​ రూ.15 లక్షల నగదుతో బయటకు వచ్చేశారు. దానివల్ల పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీలో రూ.15 లక్షలు తగ్గాయి. ప్రియాంక 5వ ఫైనలిస్టుగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అందరికంటే ముందు అర్జున్ హౌస్ నుంచి బయటకొచ్చారు. ఫినాలే చూసేందుకు వచ్చిన పాత కంటెస్టెంట్లు అంతా వచ్చారు. అయితే షకీలా, కిరణ్ రాథోడ్ మాత్రం కనిపించలేదు. రవితేజ, నందమూరి కల్యాణ్ రామ్, యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల తమ సినిమాల ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు.

బిగ్​బాస్ విన్నర్​గా 'పల్లవి ప్రశాంత్'- ప్రైజ్​మనీ మొత్తం రైతులకే!

బిగ్‌బాస్‌ 7 విజేత 'రైతుబిడ్డ' కవిత అదుర్స్- రెమ్యునరేషన్‌+ ప్రైజ్‌మనీ ఎంతంటే?

Last Updated : Dec 18, 2023, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details