తెలంగాణ

telangana

షారుక్​ తనయుడు ఎంట్రీకి రంగం సిద్ధం.. కానీ ఓ ట్విస్ట్

By

Published : Dec 7, 2022, 12:26 PM IST

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​​ తనయుడు ఆర్యన్ ఖాన్ సినీ​ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. కానీ ఓ ట్విస్ట్​ ఉంది. ఏంటంటే?

Sharukh khan son as director
షారుక్​ తనయుడు ఎంట్రీకి రంగం సిద్ధం.. కానీ ఓ ట్విస్ట్

సినీ ఇండస్ట్రీలోకి మరో స్టార్‌ హీరో కుమారుడు అడుగు పెట్టనున్నాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ పరిశ్రమకు పరిచయం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్యన్‌ తన ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. షారుక్‌ నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తొలి ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు తెలిపాడు. అయితే, ఇక్కడ విశేషమేమిటంటే.. ఆర్యన్‌ హీరోగా కాకుండ దర్శకుడుగా పరిచయం అవ్వనున్నాడు.

ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన ఆర్యన్‌ "స్క్రిప్ట్‌ రాయడం పూర్తయింది. యాక్షన్‌ ఎప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తున్నా" అని రాశాడు. ఇక ఈ పోస్ట్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. షారుక్‌ స్పందిస్తూ. "వావ్‌.. ఇప్పటి వరకు ఆలోచించావు, నీపై నమ్మకం పెంచుకున్నావు, ఎన్నో కలలు కన్నావు. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే సమయం వచ్చింది. తొలి ప్రాజెక్టు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఆల్‌ ది బెస్ట్‌" అని కామెంట్‌ చేశారు. ఇక షారుక్‌ భార్య గౌరీ మాట్లాడుతూ "నీ తొలి ప్రయత్నం కోసం ఎదురుచూస్తున్నాను" అని అన్నారు. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆర్యన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా షారుక్‌-ఆర్యన్‌ మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'నాన్న.. సెట్‌లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను' అని ఆర్యన్‌ అడగ్గా.. 'అలా అయితే మీ షూటింగ్‌ కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే ఉండాలి. ఉదయం వేళలో కాదు' అంటూ షారుక్‌ చమత్కరించారు. 'ఓకే.. కేవలం రాత్రి పూట మాత్రమే షూటింగ్‌ చేస్తా..' అంటూ బదులిచ్చాడు ఆర్యన్‌.

ఇదీ చూడండి:కమల్​హాసన్​తో డేటింగ్​.. ఈ సారి ఆ హీరోయిన్​ ఏం చెప్పిందంటే?

ABOUT THE AUTHOR

...view details