తెలంగాణ

telangana

Raviteja Rashmika : రవితేజతో రష్మిక.. సూపర్​ హిట్ డైరెక్టర్​తో సినిమా!

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 3:48 PM IST

Ravi Teja Rashmika Mandanna Movie : రవితేజ సినిమాలో రష్మిక మందన్నా నటించబోతున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

Raviteja Rashmika : రవితేజతో రష్మిక.. సూపర్​ హిట్ డైరెక్టర్​తో సినిమా!
Raviteja Rashmika : రవితేజతో రష్మిక.. సూపర్​ హిట్ డైరెక్టర్​తో సినిమా!

Ravi Teja Rashmika Mandanna Movie : రవితేజ - రష్మిక మందన్నా కలిసి నటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రవితేజ - దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. 'డాన్ శీను'తో మొదలైన వీరి జర్నీ.. ఆ తర్వాత 'బలుపు', 'క్రాక్' సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్​ను అందుకున్నాయి.

Ravi Teja Gopichand Malineni Movie : అయితే ఇప్పుడీ కాంబో నాలుగో సారి సినిమా చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​లో ​వీరి సినిమా రాబోతుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మొదటి నుంచి హీరోయిన్​గా శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్​గా రష్మిక మందన్నా పేరు పైకి వచ్చింది. ఇటీవలే ఈ మూవీ మేకర్స్ రష్మికతో చర్చలు జరపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రవితేజ - రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే అవుతుంది.

ఇకపోతే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీ అవుతోంది. ఆ మధ్యలో గుడ్​ బై, మిషన్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించగా.. త్వరలోనే రణ్​బీర్​ కపూర్​తో కలిసి యానిమల్​ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పుష్ప 2, ధనుష్ 51వ చిత్రాల్లో చేస్తేంది. అయితే పుష్ప 2ను కూడా నిర్మించేది మైత్రీ మూవీ మేకర్సే కావడం విశేషం.

ఇకపోతే రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రవితేజ-తమన్ కాంబోలో వచ్చిన 'బలుపు', 'క్రాక్' వంటి చిత్రాలు కూడా మ్యూజికల్​గానూ బానే ఆకట్టుకున్నాయి. ఇక గోపిచంద్​-తమన్ కాంబోలో వచ్చిన 'బాడీగార్డ్'​, 'బలుపు', 'పండగ చేస్కో', 'విన్నర్'​, 'క్రాక్'​, 'వీరసింహారెడ్డి' చిత్రాలు కూడా మ్యూజికల్​గా బానే ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details