తెలంగాణ

telangana

రూ.2 కోట్లు ఇచ్చి దర్శకుడు పూరీ అప్పు తీర్చిన విజయ్​ దేవరకొండ

By

Published : Aug 15, 2022, 12:31 PM IST

కష్టాల్లో అండగా నిలిచి.. తనను ఓ తండ్రిలా విజయ్‌ దేవరకొండ చూసుకున్నాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. రూ.2కోట్లు ఇచ్చి తన అప్పు తీర్చాడని చెప్పారు. తన భార్య చెప్పడం వల్లే విజయ్​తో సినిమా చేసినట్లు గుర్తుచేసుకున్నారు.

Vijay devarkonda returns 2 crores to  Puri jagannadh
విజయ్​ దేవరకొండ పూరి జగన్నాథ్​

రౌడీహీరో విజయ్​ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు దర్శకుడు పూరీ జగన్నాథ్​. కష్టాల్లో అండగా నిలిచి.. తనను ఓ తండ్రిలా చూసుకున్నాడని అన్నారు. తన భార్య లావణ్య చెప్పడం వల్లే 'అర్జున్‌రెడ్డి' వీక్షించానని.. ఆ సినిమా చూస్తున్నప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన అప్పుల గురించి తెలుసుకొని విజయ్‌ రూ.2 కోట్ల పారితోషికం వెనక్కి పంపించేశాడని తెలిపారు.

"కరణ్‌ జోహార్‌కు ముందు థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయన కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌. 'లైగర్‌' విషయంలో ఆయన మాకెంతో సపోర్ట్‌ చేశారు. అపూర్వ మెహ్త, ధర్మా టీమ్‌ మొత్తానికి నా ధన్యవాదాలు. 'కొత్త దర్శకులు వస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. నువ్వు వెనుకబడిపోతున్నావ్. కొంచెం పక్క వాళ్ల సినిమాలు కూడా చూస్తూ ఉండు‌. ఎవరో సందీప్‌ రెడ్డి వంగా అట. కొత్తగా వచ్చాడు. విజయ్‌ అనే యువ నటుడితో 'అర్జున్‌ రెడ్డి' తీశాడు. సినిమా బాగుంది. మన ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే మూడు సార్లు ఆ సినిమా చూశాం' అంటూ ఓరోజు నా భార్య నన్ను తిట్టింది. లావణ్య చెప్పడంతో నేనూ ఆ సినిమా చూశా. 45 నిమిషాలయ్యే సరికి సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించలేదు. కేవలం విజయ్‌ యాక్టింగ్‌ పైనే నా ఫోకస్‌ నిలిచిపోయింది. అతడి నటనలో నిజాయతీ ఉందనిపించింది. అతడితో ఎలాగైనా సినిమా చేయాలనిపించింది. ఇక 'లైగర్‌'లో ఏ సీన్‌ చూసినా.. ఎక్కడా విజయ్‌ నటనలో పొగరు కనిపించదు. కేవలం నిజాయతీ మాత్రమే కనిపిస్తుంది. విజయ్‌ రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే. ఒక నిర్మాతగా అతడికి ఓసారి రూ.కోటి పంపిస్తే.. 'నాకు ఇప్పుడే వద్దు ఈ డబ్బుని ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండి. నేను తర్వాత తీసుకుంటా' అని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి రూ.రెండు కోట్లు పంపిస్తే నాకు అప్పులున్నాయని తెలుసుకుని.. 'ఈ డబ్బుతో మీరు ముందు అప్పులు తీర్చేయండి' అని ఆ డబ్బుని వెనక్కి పంపించేశాడు. సినిమా జరుగుతునన్ని రోజులు నాకెంతో సపోర్ట్‌గా నిలిచాడు. నన్నొక తండ్రిలా చూసుకున్నాడు. ఇలాంటి నటుడిని నేనెక్కడా చూడలేదు" అని పూరీ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: మహానీయుల త్యాగం వల్లే ఈ స్వాతంత్య్ర వజ్రోత్సవాలన్న చిరంజీవి

ABOUT THE AUTHOR

...view details