తెలంగాణ

telangana

'హరి హర వీరమల్లు' నుంచి మరో అప్డేట్​.. ఫైటర్​ ఫోజులో పవన్ కల్యాణ్

By

Published : Oct 10, 2022, 9:23 PM IST

'హరి హర వీరమల్లు' చిత్రం నుంచి మరో అప్డేట్​ వచ్చింది. తాజాగా పవన్​ కల్యాణ్ యుద్ధ సన్నివేశాల కోసం సన్నద్ధం అవుతూ ఉన్న ఫొటో వైరల్ అయ్యింది.

hari hara veeramallu movie
hari hara veeramallu movie

పవర్ స్టార్​ పవన్ కల్యాణ్​ దర్శకుడు క్రిష్​ కలయికలో వస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రీ షెడ్యూల్ వర్క్​షాప్​ను నిర్వహించింది చిత్ర బృందం. ఇందులో సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అందులో పాల్గొన్న పవన్​ కల్యాణ్​ ఫొటోలు క్షణాల్లో వైరల్​ అయ్యాయి. అయితే తాజాగా చిత్రం నుంచి మరో అప్డేట్​ వచ్చింది. పవర్ స్టార్​ యుద్ధ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఓ ఫొటో వైరల్ అయ్యింది. అందులో పవన్​ కల్యాణ్ హుడీ వేసుకుని.. చేతికి బ్యాండేజ్​ కట్టుకుని ఫైట్​కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

'హరి హర వీరమల్లు' హిస్టారికల్‌ చిత్రంగా సిద్ధమవుతోంది. మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా దీన్ని రూపొందిస్తున్నారు. రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్‌)దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌తో నిధి అగర్వాల్‌ ఆడిపాడనుంది. 'హరి హర వీరమల్లు' సినిమాలో నటులు సునీల్‌, సుబ్బరాజు, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా పవర్​ స్టార్​ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అక్టోబర్‌ రెండో వారం తర్వాత నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌.

ఇవీ చదవండి :'జిన్నా' నుంచి 'జారు మిఠాయా' సాంగ్... సన్నీ లియోనీ స్టెప్పులు అదుర్స్..

'ఆదిపురుష్​పై నిషేధం'.. హీరో ప్రభాస్​కు దిల్లీ కోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details