తెలంగాణ

telangana

కల్యాణ్​రామ్​ 'బింబిసార'లో ఎన్టీఆర్​!

By

Published : Jul 5, 2022, 7:18 AM IST

NTR KalyanRam Bimbisara movie: హీరో కల్యాణ్​రామ్​ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. అయితే ఈ మూవీలో హీరో ఎన్టీఆర్​ కూడా నటించే అవకాశముందని అన్నారు కల్యాణ్​. ఈ సినిమా నాలుగు భాగాలుగా ఉంటుందని చెప్పారు.

NTR KalyanRam Bimbisara movie
కల్యాణ్​రామ్​ 'బింబిసార'లో ఎన్టీఆర్

NTR KalyanRam Bimbisara movie: హీరో కల్యాణ్​రామ్​ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్​ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో మాట్లాడిన కల్యాణ్​.. "తాత చేసిన 'పాతాళభైరవి', 'గులేబకావళి కథ', 'జగదేక వీరుని కథ' మొదలుకొని... ఈమధ్య వచ్చిన 'బాహుబలి' వరకు ఎన్నో సోషియో ఫాంటసీ సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన మరో చందమామ కథే... మా 'బింబిసార' చిత్రం. ఫాంటసీ, వాణిజ్య అంశాల మేళవింపుతో సినిమా ఉంటుంది. మా చిత్రబృందం దీనికోసం చాలా కష్టపడింది. ఈ ఏడాది మా తాత ఎన్టీఆర్‌ శత జయంతి. ఆయనకి ఈ సినిమాని అంకితం చేస్తున్నా" అని అన్నారు.

ఈ కథని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది తన ఆలోచన అని అన్నారు కల్యాణ్​. రెండో భాగం వచ్చే ఏడాది ఆగస్టు 23కి విడుదల చేస్తామని తెలిపారు. 3, 4 భాగాలుగా కూడా రావొచ్చని, అన్నీ కుదిరితే ఎన్టీఆర్‌ కూడా నటిస్తారని తెలిపారు. దర్శకుడు వశిష్ఠ్‌ మాట్లాడుతూ "దర్శకుడు చెప్పిన కథ విన్న మరుక్షణం నుంచి 'నువ్వు చేయగలవు' అంటూ కథానాయకుడు కల్యాణ్‌రామ్‌, నిర్మాత హరి ఎంతో ప్రోత్సాహించారు. మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులు తెరపై చూస్తార"న్నారు.

ఇదీ చూడండి: DJ Tillu: ఏమైంది రాధికా.. సీక్వెల్​లో​ ఉండవా?

ABOUT THE AUTHOR

...view details