తెలంగాణ

telangana

నాని 'దసరా' కొత్త అప్డేట్​​.. సింగర్​ సునీత కొడుకుతో దర్శకేంద్రుడి సినిమా

By

Published : Jan 26, 2023, 5:43 PM IST

Updated : Jan 26, 2023, 7:02 PM IST

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. వాటిలో నాని దసరాతో పలు యంగ్​ హీరోల కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి. అందులో సింగర్​ సునీత తనయుడు ఎంట్రీ ఇవ్వనున్న తొలి మూవీ గురించి కూడా విశేషాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు నిర్మిస్తున్నారు. ఆ సంగతులన్నీ మీకోసం..

nani dasara update
nani dasara update

నేచురల్​ స్టార్​ నాని లేటెస్ట్ మూవీ దసరా. తెలంగాణలోని గోదావరిఖని సింగరేణీ బొగ్గు గనుల నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో నాని ఊరమాస్​ లుక్​లో కనిపించారు. కాగా ఇప్పటికే హీరోయిన్​ కీర్తి సురేశ్​ లుక్​ను సైతం చిత్ర యూనిట్​ విడుదల చేసింది. ఈ క్రమంలో ఎప్పటిక​ప్పుడు లేటెస్ట్​ అప్డేట్స్​ను రిలీజ్​ చేసే మూవీ టీమ్​ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్​ చేసింది. ఈ పోస్టర్​ చూసిన నాని ఫ్యాన్స్​ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరో వైపు మూవీ టీజర్​ను జనవరి 30న రిలీజ్​ చేస్తున్నట్లు అప్డేట్​లో తెలియజేశారు. కాగా తెలుగుతో పాటుగా, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది.

సింగర్​ సునీత తనయుడి సినిమాకు దర్శకేంద్రుని నిర్మాణం..
ప్రముఖ నేపథ్య గాయనీ సునీత తనయుడు ఆకాశ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు నిర్మిస్తున్న చిత్రం 'సర్కారు నౌకరి'. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

సింగర్​ సునీత కొడుకు ఆకాశ్​

రాఘవేంద్రరావు హాజరై దేవుడి చిత్ర పటాలపై క్లాప్ కొట్టగా జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ కెమెరా స్విచ్​ ఆన్​ చేశారు. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాశ్​కు జోడిగా భావన వళపండల్ కథానాయికగా నటిస్తుంది. తనికెళ్ల భరణి, సూర్య, సాయిశ్రీనివాస్ వడ్లమాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్​ను ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవ్వనున్నట్లు చిత్ర యూనిట్​ తెలిపింది.

మాస్​ కా దాస్​ చేతుల మీద 'బుట్టబొమ్మ' ట్రైలర్​ రిలీజ్​..
బాల నటి అనిఖా సురేంద్రన్​ హీరోయిన్​గా నటించిన తొలి చిత్రం 'బుట్టబొమ్మ'.. ఇప్పటికే వచ్చిన టీజర్​ పోస్టర్​తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపిన ఈ సినిమా ట్రైలర్​ను జనవరి 28న రిలీజ్​ చేయనున్నట్లు మూవీ టీమ్​ అప్డేట్​ ఇచ్చింది. మాస్​ కా దాస్​ విశ్వక్​సేన్​ ఈ సినిమా ట్రైలర్​ రిలీజ్​ చేస్తున్నట్లు చిత్ర యూనిట్​ తెలిపింది.

'ఆపరేషన్​ రావణ్​'లో 'పలాస' హీరో..
'పలాస 1978'తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు రక్షిత్ ఆపరేషన్ రావణ్ అనే నెక్స్ట్​ ప్రాజెక్ట్​తో బీజీ అయిపోయారు. రాధిక శరత్ కుమార్, చరణ్ రాజ్, విద్యాసాగర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్​ను సైతం విడుదల చేశారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేయనుందని చిత్ర యూనిట్​ తెలిపింది.

ఆపరేషన్​ రావణ్​ పోస్టర్​

సాయిరామ్ శంకర్ కొత్త మూవీ టైటిల్​ సాంగ్​ రిలీజ్​..
పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వెయ్ దరువెయ్. నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజు పొత్తూరు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. వెయ్ దరువెయ్ అంటూ సాగే పాట చాలా ఆసక్తికరంగా ఉందని, చిత్రం మంచి విజయం సాధిస్తుందని చైతన్య ఆకాంక్షించారు. కాగా ఈ పాటకు బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. సాయిరామ్ శంకర్ కు జోడిగా యాశ శివకుమార్ నటించగా సునీల్, కాశి విశ్వనాథ్, పోసాని కృష్ణమురళీ, పృథ్వి ముఖ్య పాత్రలు పోషించారు.

కల్యాణ్‌రామ్‌ 'అమిగోస్‌' సెకండ్‌ సింగిల్..
కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అమిగోస్‌'. అశికా రంగనాథ్‌ కథానాయిక. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ 'ఎన్నో రాత్రులొస్తాయి' పాటను ఈ నెల 29న సాయంత్రం 5.09గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

అమిగోస్​ సెకెండ్ సింగిల్​

దేశం కోసం 'సత్య'
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి వెలుగులోకి రాని వీరులకు అంకితమిస్తూ 'సత్య' అనే వీడియో పాటను త్వరలో విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి నటించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు.

సత్య పోస్టర్​
Last Updated :Jan 26, 2023, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details