తెలంగాణ

telangana

అది చెప్పడానికి ధైర్యం కావాలి: నాని

By

Published : Jun 13, 2022, 5:10 PM IST

'అంటే... సుందరానికీ!' లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయని చెప్పారు కథానాయకుడు నాని. అలాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలని అన్నారు. సినిమా సక్సెస్​ సెలబ్రేషన్స్​లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ante sundaraniki success meet
ante sundaraniki

"'అంటే... సుందరానికీ!' బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టరా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది" అని అంటున్నారు నాని. ఆయన, నజ్రియా జంటగా నటించిన లేటస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. నాని కామెడీ టైమింగ్‌, నజ్రియా యాక్టింగ్‌ అదరహో అనేలా ఉన్నాయని సినీ ప్రియులు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం విజయోత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మంచి సినిమాలు వచ్చినప్పుడు వాటిని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మీడియాపై ఉందని అన్నారు.

"టీమ్‌ మొత్తం కష్టపటడం వల్లే ఈ సినిమా తెరకెక్కింది. వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు మేము బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నామంటే.. మూడు రోజుల్లోనే ఇది సాధ్యమైందా..? అని మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు మేము నంబర్స్‌ (కలెక్షన్స్)ని సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు. ప్రేక్షకుల నుంచి మా చిత్రానికి దక్కిన ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. మా సినిమా బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టరా? కాదా? అనేది కాలమే చెబుతుంది. కానీ, సినిమా చూసిన వాళ్ల ప్రేమను గెలుచుకోవడంలో మేము ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాం. ఇలాంటి మంచి చిత్రాలు ఎంతో అరదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు చేరువ కావడానికి మీడియా వాళ్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంటారు. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని భుజాలపై వేసుకుని ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లాలని కోరుతున్నా"

"వెనక్కి తిరిగి చూసుకుంటే నాకెరీర్‌లోని గొప్ప సినిమాల్లో 'అంటే... సుందరానికీ!' టాప్‌ ఆర్డర్‌లో ఉండే సినిమా. ఇలాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం మా అందరిలో ఉంది. ఇదొక ఆవకాయ లాంటి సినిమా. 'ఈ ఏడాదిలో వచ్చిన మంచి సినిమాలేంటి' అని ఎవరైనా ఏడాది చివర్లో అడిగితే అందులో తప్పకుండా 'అంటే... సుందరానికీ!' ఉంటుంది" అని నాని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:ఆ ఒక్కరి కోసమే 'విరాటపర్వం' చేశా: రానా

ABOUT THE AUTHOR

...view details