తెలంగాణ

telangana

మరోసారి లవర్​బాయ్​గా చైతూ అదుర్స్​.. అగ్ర హీరోలతో సమంత ఢీ

By

Published : Jun 16, 2022, 5:53 PM IST

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న 'థ్యాంక్‌ యూ', కిరణ్‌ అబ్బవరం 'సమ్మతమే', సమంత 'యశోద' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

samantha
naga chaitanya

అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా నుంచి 'ఏంటో ఏంటో' అనే మెలడీ లిరికల్ సాంగ్ విడుదలైంది. పాటలో లవర్​బాయ్​ లుక్స్​తో మరోసారి ఆకట్టుకుంటున్నారు చైతూ.

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు. జులై 8న చిత్రం థియేటర్లలో విడుదలకానుంది.

కిరణ్‌-చాందిని 'సమ్మతమే' ట్రైలర్‌:కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'సమ్మతమే'. చాందినీ చౌదరి కథానాయిక. యు. జి. ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన చిత్ర బృందం ఇందులో భాగంగానే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో గురువారం ట్రైలర్‌ను విడుదల చేయించింది. కంకణాల ప్రవీణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు.

ఆమిర్​తో అక్షయ్ ఢీ.. బరిలోనే సామ్​ కూడా:బాక్సాఫీస్ వేదికగా మిస్టర్ పర్​ఫెక్ట్​ ఆమిర్ ఖాన్​ను ఢీకొనబోతున్నారు అక్షయ్ కుమార్. అన్నా చెల్లెల్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'రక్షా బంధన్' అనే సినిమాను రాఖీ సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చద్ధా' కూడా అదే రోజున విడుదలకానుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారనేది వేచిచూడాలి.

'రక్షా బంధన్'- 'లాల్ సింగ్ చద్ధా'

1994లో విడుదలైన 'ఫారెస్ట్​ గంప్​' అనే హాలీవుడ్​ సినిమాకు హిందీ రీమేక్​గా 'లాల్​ సింగ్ చద్ధా' తెరకెక్కింది. ఇందులో ఆమిర్​ఖాన్​ సరసన కరీనా కపూర్​ నాయికగా నటించింది. నాగచైతన్య కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికి అద్వైత్​ చందన్​ దర్శకత్వం వహించారు. ఇక అగ్రతార సమంత నటించిన 'యశోద' కూడా ఈ రెండు సినిమాలతో పోటీలో ఉంది. 'యశోద' ఆగస్టు 12న విడుదలకానుంది.

సమంత

ఇదీ చూడండి:అవకాశం వస్తే ఆ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రాశీఖన్నా

ABOUT THE AUTHOR

...view details