తెలంగాణ

telangana

Nag Aswin Kalki 2898 AD : 'కల్కీ' గ్రాఫిక్స్​పై నాగ్అశ్విన్​ కామెంట్స్.. VFX​ విషయంలో అలా చేయాలనుకున్నా అంటూ..

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 4:12 PM IST

Nag Aswin Kalki 2898 AD : ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ మూవీ 'కల్కి 2898 ఏడీ' గురించి ఆ మూవీ డైరెక్టర్​ నాగ్​ అశ్విన్​ తాజాగా ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Nag Aswin Kalki 2898 AD

Nag Aswin Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ మూవీ 'కల్కి 2898 ఏడీ'. 'మహానటి' ఫేమ్​ నాగ్​అశ్విన్​ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్​ బచ్చన్​, దీపికా పదుకుణె, దిశాపటానీ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం వీఎఫ్ఎక్స్​ గురించి దర్శకుడు నాగ్​ అశ్విన్​ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశారు. ఈ 'కల్కీ'ని మేకిన్​ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని.. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ మొత్తం ఇండియాలోనే చేయాల‌నుకున్నామని తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఉన్న కథ, దాని అంచనాల కార‌ణంగా ఈ సినిమాకు హాలీవుడ్ కంపెనీస్‌తో క‌లిసి గ్రాఫిక్స్ వ‌ర్క్ చేయాల్సివ‌చ్చింద‌ని తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వ‌ర్క్ ఇండియాలోనే చేశామ‌ని తెలిపారు. అంతే కాకుండా యానిమేష‌న్‌, గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ విష‌యంలో భ‌విష్య‌త్తులో హాలీవుడ్ సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదని ఆయన అన్నారు. హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థ‌లు ఇండియాలోనే ఉన్నాయ‌ని.. తన తర్వాతి ప్రాజెక్టులకు పూర్తిగా ఇక్కడి టాలెంట్​ను ఉపయోగించుకుని కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్​గా తయారు చేస్తానని నాగ్​ అశ్విన్ పేర్కొన్నారు.

Kalki 2898 Latest Posters : తాజాగా బిగ్ బీ అమితాబ్​ బచ్చన్ బర్త్​డే సందర్భంగా ఆయనకు విషెస్​ చెప్పిన మూవీ టీమ్​.. రిలీజ్​ చేసిన ఓ పోస్ట్​ర్​ అందరిని ఆకట్టుకుంది. 'కల్కి' సినిమాలోని అమితాబ్ లుక్​ను ఆ పోస్టర్​లో రివీల్​ చేసింది. అందులో సాధువులా కనిపించిన అమితాబ్​ తన కొత్త లుక్​తో అభిమానులను ఆకర్షించారు. అంతే కాకుండా ప్రభాస్ బర్త్​డేకు కూడా మేకర్స్​ సూపర్​ పోస్టర్​ను రివీల్​ చేశారు. అది కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Kalki 2898 AD Cast : ఇక 'కల్కి 2898 ఏడీ' విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు మూవీ టీమ్​ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కామికాన్‌ వేదికగా విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌నకు విశేష ఆదరణ లభించింది. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్స్‌ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

యమా స్టైలిష్​ లుక్​లో ప్రభాస్​.. 'రైడర్స్'​ కంట్రోల్​లోకి కామిక్​ కాన్​ ఈవెంట్​

ప్రాజెక్ట్​-కె మూవీ మేకర్స్ షాకింగ్ న్యూస్.. ఫ్యాన్స్​కు ఎదురుచూపులు తప్పవా?

ABOUT THE AUTHOR

...view details