Mrunal Thakur Marriage :స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే కెరీర్లో ఎదుగుతున్న సమయంలో సెలబ్రిటీల గురించి రూమర్స్ రావడం కామన్. అలాగే నటి మృణాల్ గురించి కూడా.. కొన్ని రోజుల క్రితం ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఆమె ఓ తెలుగు అబ్బాయిని పెళ్లాడబోతున్నారంటూ.. పలు వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మృణాల్ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
తనపై వస్తున్న రూమర్స్‌ను కొట్టిపడేశారు నటి మృణాల్ ఠాకూర్. శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వాటన్నింటికీ చెక్ పెట్టారు. ' హాయ్! మీ హార్ట్ బ్రేక్ చేస్తున్నందుకు ఐయామ్ సో సారి గాయ్స్.. నా ఫ్రెండ్స్, డిజైనర్స్, రిలేటివ్స్ వరుసగా ఫోన్‌కాల్స్ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. మరి అతడు ఎవరో నాక్కూడా తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్ గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. అయితే అబ్బాయిని మీరే వెతికి, కల్యాణ వేదిక, లోకేషన్ షేర్ చేయండి' అని మృణాల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేశారు.