తెలంగాణ

telangana

Ram Charan Baby : ఆనందంలో చిరంజీవి.. 'మెగా ప్రిన్సెస్'​కు వెల్​కమ్​ చెప్పిన తాతయ్య!

By

Published : Jun 20, 2023, 6:24 AM IST

Updated : Jun 20, 2023, 10:28 AM IST

Ram Charan Baby : మెగా పవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన తాతయ్య చిరంజీవి తన మెగా ప్రిన్సెస్​కు వెల్​కమ్​ చెప్పారు.

Ram Charan
Ram Charan and upasana baby

Ram Charan Baby : టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. మెగా పవర్​ స్టార్​ రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

'మెగా ప్రిన్సెస్'​కు వెలకమ్​ చెప్పిన తాతయ్య!

Chiranjeevi Tweet : మెగా ఫ్యాన్స్​కు రామ్​చరణ్​ తీపికబురు అందించిన వేళ తాతయ్య మెగాస్టార్​ చిరంజీవి కూడా ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. రాత్రంతా ఆస్పత్రిలోనే ఆ చిన్నారితో గడిపారట. ఇక ట్విట్టర్​ వేదికగా తన మనవరాలికి వెలకమ్​ చెప్పిన మెగాస్టార్​.. 'లిటిల్ మెగా ప్రిన్సెస్'కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. "నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీన్ని చూసిన అభిమానులు మెగా ఫ్యామిలీకి కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

'అత్త మామాలతోనే'
సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను, చరణ్‌.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని ఉపాసన తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్​ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని, వారితో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవాలని లేదని చెప్పారు.

పాపాయి కోసం.. కాలభైరవ స్పెషల్ ట్యూన్!
ఉపాసన, రామ్ చరణ్ దంపతుల బిడ్డ కోసం టాలీవుడ్​ యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​, కాల భైరవ ఓ అద్భుతమైన ట్యూన్​ను గిఫ్ట్​గా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేసిన రామ్ చరణ్​ దంపతులు.. ఈ ట్యూన్ విని చిన్నారులు ఆనందంలో మునిగిపోయేలా ఉన్నారంటూ కాల భైరవకు కితాబులిచ్చారు.

"ఈ ట్యూన్​ను మా కోసం ప్రత్యేకంగా తయారు చేసినందుకు థ్యాంక్యూ కాల భైరవ. ఈ భూమ్మీద ఉన్న లక్షల మంది చిన్నారుల్లో ఈ మెలోడి ట్యూన్ సంతోషాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం." అంటూ రామ్ చరణ్ దంపతులు ట్వీట్ చేశారు.

ఇక బిడ్డ పుట్టక ముందు నుంచే మెగా ఇంటికి బహుమతుల వెల్లువ మొదలైంది. ఇటీవలే ఉపాసన సోషల్​ మీడియాలో తమ చిన్నారి కోసం చేయించిన ఓ ఊయల గురించి ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతతో పాటు దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకుని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోందని.. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన తెలిపారు.

Ram Charan Movies : ఇక రామచరణ్ సినిమాల విషయానికి వస్తే.. గత కొద్ది రోజుల నుంచి రామ్​ చరణ్​ షూటింగ్స్​కు బ్రేక్ ఇచ్చారని.. కొద్ది రోజుల పాటు తన పాపాయితో గడపాలని ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకురాన్ని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి నుంచి ఆగస్ట్​ వరకు రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనరని సినీ వర్గాల టాక్​. ఇక రామ్​చరణ్​ ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్​​ బుచ్చిబాబుతో కలిసి 'ఆర్​సీ 16' అనే మూవీకి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. శంక‌ర్​తో సినిమా పూర్తి కాగానే ఈ కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్​లో ఉన్నట్లు టాక్​.

Last Updated :Jun 20, 2023, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details