తెలంగాణ

telangana

'జిన్నా' నుంచి 'జారు మిఠాయా' సాంగ్... సన్నీ లియోనీ స్టెప్పులు అదుర్స్..

By

Published : Oct 10, 2022, 8:09 PM IST

మంచు విష్ణు హీరోగా నటించిన 'జిన్నా' చిత్రం నుంచి మరో పాట విడుదలైంది. ఇందులో విష్ణుతో అదరిపోయే స్టెప్పులేసింది సన్నీ లియోనీ.

jinna sunny leone song released
jinna sunny leone song released

మంచు విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కించిన చిత్రం 'జిన్నా' . పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోనీ కథానాయికలు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్​ నవ్వులు పూయిస్తోంది. రెస్పాన్స్​ కూడా బాగానే ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి విష్ణు మంచి హిట్టు కొట్టేటట్టు కనిపిస్తున్నారు.

అయితే తాజాగా చిత్ర బృందం ఓ హుషారైన గీతాన్ని విడుదల చేసింది. 'నువ్వొస్తావని నేను సిల్క్‌ చీర కట్టుకుంటిని' అంటూ సాగే పాటలో విష్ణుతో సన్నీ లియోనీ ఆడిపాడింది. మంచి హూషారైన బీట్​కు అదరగొట్టే స్టెప్పులతో కుర్రకారు మదిని మాయం చేసేలా నాట్యమాడింది ఈ సుందరి. యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ పాటను గణేశ్‌ రచించారు. నిర్మలా రాథోడ్‌, సింహ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

ABOUT THE AUTHOR

...view details