ETV Bharat / entertainment

నయన్​కు​ కవల పిల్లలు.. ఎన్టీఆర్​ చెప్పిందే నిజమైందిగా!

author img

By

Published : Oct 10, 2022, 1:04 PM IST

నయనతారకు కవల పిల్లలు పుడతారని యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం ఆ విషయం సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటి తారక్​కు ఎలా తెలుసని అనుకుంటున్నారా? ఆ సంగతులు..

NTR About Nayantara twin children
నయన్​ కవల పిల్లలు ఎన్టీఆర్​

ప్రముఖ కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దంపతులకి పుత్రోత్సాహం కలిగిన విషయం తెలిసిందే. ఈ జంట కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విఘ్నేష్‌ శివన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ఆదివారం ప్రకటించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ జోడీ సరోగసి పద్ధతి ద్వారా జన్మనిచ్చారు. కొందరు వీరికి శుభాకాంక్షలు తెలపగా మరికొందరు విమర్శిస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే నయనతార పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ మరొకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్​లో దూసుకుపోతుంది. అదేంటంటే, నయనతార కవలలకు జన్మనిస్తుందన్న సంగతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేశారు. అదేంటి తారక్​కు ఎలా తెలుసని అనుకుంటున్నారా?.. నయన్​-తారక్​ కలిసి అదుర్స్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. చారిగా తారక్ అదిరిపోయే పర్ఫామెన్స్​తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ సీన్ ఉంటుంది.

ఆ సన్నివేశంలో నయనతార తన స్నేహితులతో కలిసి పందెం వేసుకుని స్విమ్మింగ్ పూల్​లోకి దూకగా.. ఎన్టీఆర్.. నయన్​ సూసైడ్ చేసుకోబోతుందని అనుకుని ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే తారక్.. నయనతారతో మీకు కవల పిల్లలు పుడతారండి.. మీకు అక్కడ పుట్టు మచ్చ ఉంది అని అంటాడు. దీంతో వెంటనే నయన్​ షాక్ అవుతుంది. అయితే ఇప్పుడా వీడియోనే కొందరు నెటిజన్స్​ సరదాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: నయనతార సీనియర్లు వీరే.. సరోగసితో బిడ్డను కన్న సెలబ్రిటీలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.