తెలంగాణ

telangana

కరణ్​జోహార్​ షాకింగ్ నిర్ణయం.. కారణమిదేనా!

By

Published : Oct 10, 2022, 10:48 PM IST

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన ఫ్యాన్స్​కు షాకింగ్​ విషయం చెప్పారు. ఏంటంటే?

karan johar
కరణ్​ జోహార్​

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్​గా మారారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు హిట్​ సినిమాలను రూపొందించారు. అయితే ఈ ఈ మధ్య కాలంలో మాత్రం పూర్తిగా నిర్మాణ రంగం మీదే ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన ఓ షాకింగ్​ నిర్ణయం తీసుకున్నారు. సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​కు వీడ్కోలు చెప్పారు."మరింత పాజిటివ్ వైబ్స్ కోసం ట్విట్టర్​కు వీడ్కోలు చెబుతున్నాను. ఇలా చేయడమే సరైనది. గుడ్​బై ట్విట్టర్" అని పేర్కొన్నారు.

కాగా, కరణ్​ జోహార్​.. కాఫీ విత్​ కరణ్​షోతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. 2004లో ప్రారంభమైన ఈ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుని, ప్రస్తుతం 7వ సీజన్​లో నడుస్తోంది. సినిమాల పరంగా కరణ్‌ జోహార్‌ ఎంత పాపులర్‌ అయ్యారో, ఈ షో ద్వారా అంతే ప్రాముఖ్యత సంపాదించారంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ షోను అభిమానించే వారితో పాటు, విమర్శించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. గత కొన్నేళ్లుగా ఈ షోలో ద్వంద్వార్థాలతో పాటు, అంతరంగిక విషయాల ప్రస్తావన ఎక్కువగా వస్తుండటంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా కాఫీ విత్‌ కరణ్‌ షో ని విమర్శకులు ట్రోల్‌ చేస్తున్నారు. కరణ్‌ అతని షోకి వచ్చే బాలీవుడ్‌ సెలెబ్రిటీలపై నెట్టింట ఛలోక్తులు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విట్టర్​కు గుడ్​బై చెప్పారు.

ఇదీ చూడండి: లైగర్​ ఆడకపోవడంపై విజయ్​ దేవరకొండ ఏం అన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details