తెలంగాణ

telangana

ఇంట్రెస్టింగ్​గా కల్యాణ్​ రామ్​ 'డెవిల్' గ్లింప్స్​.. 'గూఢ‌చారి అంటే ఇలానే ఉండాలా'

By

Published : Jul 5, 2023, 12:00 PM IST

Updated : Jul 5, 2023, 12:55 PM IST

kalyanram devil movie : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా 'డెవిల్' స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు మేకర్స్​.

Kalyn ram devil
కల్యాణ్​ రామ్​ 'డెవిల్' టీజ‌ర్‌.. ఈ గూఢ‌చారి లక్షణం ఏంటంటే?

kalyanram devil movie : 'బింబిసార'తో సూపర్ హిట్​ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. అదే సమయంలో చకచకా రెండు మూడు ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టారు. అందులో భాగంగానే ఆ మధ్యలో 'అమిగోస్​' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనీసం వసూళ్లను కూడా అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు త్వరలోనే 'డెవిల్' ప్రేక్షకులను పలకరించనున్నారు. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఆయన పుట్టినరోజ సందర్భంగా స్పెషల్ గ్లింప్స్​ రిలీజ్​ చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం కల్యాణ్​ రామ్ డైలాగ్​లతో, యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Devil movie teaser : 'మీరు చెప్పేదానికి చేసే దానికి, ఆలోచించేదానికి అస్సుల సంబంధం ఉండదు' అని అడగగా.. 'మనసులో ఉన్న భావన ముఖంలో తెలీకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉన్న ముఖ్య లక్షణం' అని కల్యాణ్ రామ్​ డైలాగ్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్​ సంయుక్త మేనన్​ ఒక్క షాట్​లో మాత్రమే కనిపించింది. కానీ ఆమె నవ్వు, అందం అదిరిపోయింది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కూడా​ ఆకట్టుకుంటోంది.

Kalyan ram devil movie cast : ఇకపోతే ఈ సినిమాకు నవీన్ మేడారం డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథను అందించారు. కళ్యాణ్ రామ్ ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. అలానే సినిమా కూడా బ్రిటీష్ కాలం నాటి కథలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మేనన్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. ఈ మధ్యే 500 మంది ఫైటర్స్​తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్​ను చిత్రీకరించారని తెలిసింది. ఈ చిత్రానికి ఈ ఎపిసోడే స్పెషల్​ అట్రాక్షన్​గా, హైలైట్ గా నిలుస్తుందని సినీ వర్గాల ఇన్​సైడ్ టాక్​.

ఇదీ చూడండి :

'బింబిసార 2' పరిస్థితేంటి.. డైరెక్టర్​ మారినట్టేనా?

Last Updated :Jul 5, 2023, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details