తెలంగాణ

telangana

'డెవిల్' సీక్వెల్​పై కల్యాణ్​ రామ్​ క్లారిటీ - 'ఆ ఐడియా నాకు ఇంట్రెస్టింగ్​గా అనిపించింది'

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 10:21 PM IST

Kalyan Ram Devil Movie Sequence : 'బింబిసార', 'అమిగోస్​'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్ తాజాగా డెవిల్​ సినిమాతో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 29)న థియేటర్లలోకి విడుదలైంది. ఈ నేపథ్యంలో గురించి హీరో అప్​డేట్​ ఇచ్చేశారు.

Kalyan Ram Devil Movie Sequence
Kalyan Ram Devil Movie Sequence

Kalyan Ram Devil Movie Sequence :టాలీవుడ్ స్టార్ హీరో కల్యాణ్‌ రామ్‌ తాజాగా 'డెవిల్​' అనే సస్పెన్స్‌ థ్రిల్లర్​తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 29)న థియేటర్లలోకి విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అంతటా పాజిటివ్​ టాక్ అందుకుని సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్స్​ చేసుకుంది. ఇందులో పాల్గొన్న హీరో కల్యాణ్‌రామ్‌ తన కో స్టార్స్​తో పాటు చిత్రబృందానికి విషెస్ తెలిపారు. వారి కృషి వల్లే ఈ ప్రాజెక్ట్​ సక్సెస్​ అయ్యిందంటూ అభినందించారు. ఈ నేపథ్యంలోనే మూవీ సీక్వెల్​ గురించి కూడా అప్​డేట్​ ఇచ్చేశారు.

"డెవిల్‌ 2ను తెరకెక్కించాలన్నఆలోచన మాకు ఎప్పటి నుంచో ఉంది. కారైకుడిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మూవీ రైటర్ శ్రీకాంత్‌ విస్సా 'డెవిల్‌ 2' ఐడియాను చెప్పారు. అది నాకు ఎంతో ఇంట్రెస్టింగ్​గా అనిపించింది. 2024-25లో ఈ ప్రాజెక్ట్​ను సెట్స్​పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 1940తో పాటు ప్రస్తుతం ఉన్న కాలాన్ని కూడా చూపించనున్నాం" అంటూ కల్యాణ్​ రామ్ సీక్వెల్ అప్డేట్​ గురించి మాట్లాడారు.

స్టోరీ ఏంటంటే ?
1940ల్లో జ‌రిగే క‌ల్పిత క‌థ ఇది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారత స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్‌ని ప‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటుంది. హీరో డెవిల్ (క‌ల్యాణ్‌రామ్‌) బ్రిటిష్ ప్ర‌భుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే బోస్ రాక గురించి ప్రభుత్వానికి స‌మాచారం అందుతుంది. ర‌స‌పురంలోని జ‌మిందార్ ఇంట్లో జ‌రిగిన ఓ హ‌త్య కేసుని ఛేదించ‌డానికి ప్ర‌భుత్వం డెవిల్​ని పంపుతుంది.

హ‌త్య కేసు దర్యాప్తులో సుభాష్ చంద్ర‌బోస్ నేతృత్వంలో న‌డుస్తున్న ఐఎన్ఏ (ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ) ఏజెంట్ల‌ను గుర్తిస్తాడు డెవిల్‌. మరోవైపు, బోస్ తన కుడి భుజ‌మైన త్రివ‌ర్ణతో టచ్‌లో ఉన్న విష‌యాన్ని డెవిల్‌ ప‌సిగ‌డ‌తాడు. సుభాష్ చంద్ర‌బోస్‌కి కోడ్ రూపంలో ఓ సమాచారాన్ని చేర‌వేసేందుకు త్రివర్ణ, మ‌రికొద్ది మంది ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మ‌రి ఆ కోడ్‌తో జ‌మిందార్ ఇంట్లో హ‌త్య‌కు సంబంధం ఏమిటి? ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసుని డెవిల్ ఎలా ఛేదించాడు? అస‌లు ఈ క‌థ‌లో త్రివ‌ర్ణ ఎవ‌రు? నైష‌ధ (సంయుక్త‌), మ‌ణిమేక‌ల (మాళ‌విక నాయ‌ర్‌)తో ఆమెకు సంబంధం ఏమిటి? బోస్‌ని బ్రిటిష్ ప్ర‌భుత్వం ప‌ట్టుకుందా? త‌దిత‌ర విష‌యాలను తెరపై చూడాల్సిందే.

Devil Movie Samyuktha Menon : అందమైన దేవతలా సంయుక్త మేనన్.. ఈ లుక్ చూశారా?

బ్రిటీష్​ సీక్రెట్ ఏజెంట్​గా కల్యాణ్​ రామ్ ఆకట్టుకున్నాడా? డెవిల్ ట్విట్టర్​ రివ్యూ ఇదే!

ABOUT THE AUTHOR

...view details