తెలంగాణ

telangana

ఇన్​స్టాలో కాజల్​ అగర్వాల్​ పోస్ట్​.. ఆరు లక్షల లైక్స్​.. మీరు చూశారా?

By

Published : Oct 20, 2022, 11:08 AM IST

టాలీవుడ్​ బ్యూటీ కాజల్​ అగర్వాల్​.. ఇన్​స్టా వేదికగా ఓ పోస్ట్​ చేసింది. ఆమె ఈ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఆరు లక్షల మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇంతకీ కాజల్​ పోస్ట్​ మీరు చూశారా?

kajal agarwal post about her baby boy neel
kajal agarwal post about her baby boy neel

Kajal Agarwal Post: టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఏ చిన్న విషయమైనా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఓ అందమైన పోస్ట్‌ అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. ఆమె కుమారుడు నీల్‌ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా కాజల్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ లేఖ రాసింది.

"అప్పుడే నువ్వు పుట్టి 6 నెలలు అవుతోంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. ఒక యంగ్‌ మదర్‌గా నీ విషయంలో నేను మొదట భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను. నీ పై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను, మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. మై లవ్‌.. మై నీల్‌.." అంటూ రాసుకొచ్చింది కాజల్​.
ఈ పోస్టుకు తన కుమారుడి ఫొటోను జత చేసింది. ఆమె ఈ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 6 లక్షల మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

కాజల్​ అగర్వాల్​ పోస్ట్​

ABOUT THE AUTHOR

...view details