తెలంగాణ

telangana

దూసుకుపోతున్న 'హనుమాన్'​ - 'కేజీఎఫ్', 'కాంతారా' కలెక్షన్​ రికార్డ్స్​ బ్రేక్​

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 12:08 PM IST

Updated : Jan 15, 2024, 3:48 PM IST

Hanuman Movie Beat KGF Kanatara : టాలీవుడ్ విజువల్ వండర్ 'హనుమాన్' బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, కాంతారా రికార్డులను బ్రేక్ చేసింది.

Hanuman Movie Beat KGF Kanatar
Hanuman Movie Beat KGF Kanatar

Hanuman Movie Beat KGF Kanatara :2024లో తొలి బ్లాక్​బస్టర్​గా నిలిచిన 'హనుమాన్' బాక్సాఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చిన్న సినిమాగా 2024 సంక్రాంతి బరిలో నిలిచి, ప్రేక్షకుల ఆదరణ పొంది పెద్ద విజయం సాధించింది. భారత్​తోపాటు ఓవర్సీస్​లోనూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో హనుమాన్ పలు రికార్డులను బీట్ చేసింది.

హిందీ డబ్బింగ్ వెర్షన్​లో (Hindi Dubbing Version) 'కేజీఎఫ్ పార్ట్​ 1', 'కాంతారా', 'పుష్ప ది రైజ్' సినిమాల ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను హనుమాన్ అధిగమించి రికార్డు కొట్టింది. తొలి వీకెండ్​లో ఈ బ్లాక్​బస్టర్​ సినిమాల కన్నా హనుమాన్ అత్యధిక వసూళ్లు సాధించింది. హిందీలో ఈ మూవీ ఓపెనింగ్ డే రూ.2.15 కోట్లు, శనివారం రూ.4.05 కోట్లు, ఆదివారం రూ.6.06 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో రూ.12.26కోట్లను అందుకుంది. మరోవైపు నార్త్​లో తెలుగు వెర్షన్​కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మూడు రోజుల్లో రూ.1.09 కోట్లు కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

గుంటూరు కారం vs హనుమాన్!: ఓవర్సీస్​లో హనుమాన్ తాజాగా మహేశ్​బాబు గుంటూరు కారం సినిమా కలెక్షన్స్​ను బ్రేక్ చేసినట్లు ఇన్​సైడ్ టాక్. ఇప్పటివరకు హనుమాన్ ఓవర్సీస్​లో దాదాపు 2.20+ మిలియన్ డాలర్లు వసూల్ చేయగా, గుంటూరు కారం 2.16 డాలర్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక మరో 10 రోజులు హనుమాన్ ఇదే జోరు ప్రదర్శిస్తే, భరత్ అనే నేను (3.42 మిలియన్ డాలర్లు), రంగస్థలం (3.51 మిలియన్ డాలర్లు), అల వైకుంఠపురంలో(3.61 మిలియన్ డాలర్లు) కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.

Hanuman Cast: ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్​ కుమార్ కీ రోల్స్​లో నటించగా, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, దీపక్ శెట్టి ఆయా పాత్రలు పోషించారు. ఇక ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.

మూడోరోజూ 'హనుమాన్' సునామీ- బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం- మొత్తం ఎన్ని కోట్లంటే?

3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్- లాభాల్లోకి హనుమాన్!- 2024లో తొలి బ్లాక్​బస్టర్

Last Updated : Jan 15, 2024, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details