తెలంగాణ

telangana

పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్​.. ఆ డిస్ట్రిబ్యూటర్స్ బెదిరిస్తున్నారని

By

Published : Oct 26, 2022, 10:24 PM IST

Updated : Oct 26, 2022, 10:56 PM IST

లైగర్ చిత్ర ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ చిత్ర డిస్టిబ్యూటర్లపై పోలీసులను ఆశ్రయించారు దర్శకుడు పూరి జగన్నాథ్​. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అధికారులను కోరారు.

director Puri jagannadh filled complaint on distributors
పోలీసులను ఆశ్రయించిన పూరి జగన్నాథ్

లైగర్ చిత్ర ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ చిత్ర డిస్టిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబులు తనను వేధిస్తున్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. వరంగల్ శ్రీను, శోభన్ బాబులు డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూరీ పేర్కొన్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని బంజారాహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల కిందట పూరీ వాయిస్​తో విడుదలైన ఆడియో ఫైల్ వైరల్ గా మారింది. అందులోనూ లైగర్ వల్ల నష్టపోయిన బాధితులంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని పూరీ వాపోయాడు. డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ ఆరోపించాడు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తుగా భద్రత కల్పించాలని పూరీ జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి:'కాంతారా' కాన్సెప్ట్​తో వచ్చిన ఈ సినిమా తెలుసా?.. త్వరలోనే తెలుగులో!

Last Updated : Oct 26, 2022, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details