తెలంగాణ

telangana

'సర్దేసుకుని పోవడమే' - హరీశ్ శంకర్ వైరల్​ ట్వీట్​కు రవితేజ రిప్లై!

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 7:26 PM IST

Director Harish Shankar Tweet Viral Raviteja : దర్శకుడు హరీశ్ శంకర్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దానికి మాస్ మహారాజా రవితేజ కూడా బదులిచ్చారు.

'సర్దేసుకుని పోవడమే' - హరీశ్ శంకర్ వైరల్​ ట్వీట్​కు రవితేజ రిప్లై
'సర్దేసుకుని పోవడమే' - హరీశ్ శంకర్ వైరల్​ ట్వీట్​కు రవితేజ రిప్లై

Director Harish Shankar Tweet Viral Raviteja : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్​ యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ ఒకరు. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్‌ అవుతోంది.

"ఇక్కడ ఎవరికీ ఎవరిపైనా నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడైనా పక్కవాడి అపజయానికి సోలో డ్యాన్స్ వేస్తే, రేపు వాడి అపజయానికి గ్రూప్ డ్యాన్సర్లు సిద్ధం అవుతారు" అని మాస్‌ మహారాజా హీరో రవితేజ తనతో చెప్పారంటూ హరీశ్ రాసుకొచ్చారు. ఇలాంటి విశాల దృక్పథం ఉంది కాబట్టే రవితేజ అన్నయ్య ఎంతో ఆనందంగా ఉంటారని హరీశ్‌ శంకర్‌ చెప్పుకొచ్చారు.

ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు - టాలీవుడ్​ ఫిల్మ్​ ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల రిలీజ్​కు ముందు, రిలీజ్​కు తర్వాత నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి హరీశ్‌ శంకర్‌ ఈ ట్వీట్‌ రాసుకొచ్చారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి దీనికి నీ ఎక్సటెన్షన్‌ పెట్టవేంట్రా : హరీశ్‌ శంకర్​ చేసిన ట్వీట్‌కు రవితేజ బదులిచ్చారు. 'మరి దీనికి నీ ఎక్సటెన్షన్‌ పెట్టవేంట్రా' అని అన్నారు. "మీకు అన్నీ గుర్తుంటాయ్‌ అన్నయ్యా. మీరు రైట్‌. మారుతున్న ఆడియెన్స్​ అభిరుచికి అనుగుణంగా సర్దుకుంటూ పోవాలి. లేదా మొత్తం సర్దేసుకొని వెళ్లిపోవాలి. ఇదే నా ఎక్స్‌టెన్షన్‌ అంటూ హరీశ్‌ బదులిచ్చారు.

Ravi Teja Harish Shankar Movie : కాగా, రవితేజ హీరోగా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 'మిస్టర్‌ బచ్చన్‌' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రైడ్‌ సినిమాకు రీమేక్‌ అని టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు పవన్‌ హీరోగా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను కూడా హరీశ్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం తాత్కాలికంగా నిలిచిపోయింది.

మెగా 156 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియో - డిజైన్ చేసింది ఈయనే!

'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?

ABOUT THE AUTHOR

...view details