ETV Bharat / entertainment

'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 4:59 PM IST

Guntur Kaaram Movie Mahesh babu Beedi : 'గుంటూరు కారం' సినిమాలో తాను బీడీ కాల్చిన విషయమై మాట్లాడారు సూపర్ స్టార్ మహేశ్​ బాబు. దాని సీక్రెట్ రివీల్ చేశారు.

'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?
'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?

Guntur Kaaram Movie Mahesh babu Beedi : సూపర్​​​ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లతో బాక్సాఫీస్ ముందు దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అయితే ఈ చిత్రంలో పక్కా ఫుల్ లెంగ్త్​ మాస్ క్యారెక్టర్ చేసిన మహేశ్ బాబు కొన్ని సన్నివేశాలలో బీడీ తాగుతూ కనిపించారు. ఆయన బీడీ తాగే మ్యానరిజమ్స్​ అభిమానులు, ప్రేక్షకులకు నచ్చినప్పటికీ - మహేశ్ అన్ని బీడీలు ఎలా తాగారో? బ్యాడ్ హ్యాబిట్​ను ప్రమోట్ చేస్తున్నారా? అంటూ అనికున్నారంతా. అయితే ఈ బీడీని తాగే విషయమై మహేశ్ బాబు మాట్లాడారు. యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో దాని సీక్రెట్ రివీల్ చేశారు. గుంటూరు కారం కోసం తాను తాగిన బీడీలు పొగాకుతో చేసినవి కాదని మహేశ్ క్లారిటీ ఇచ్చారు.

నాకు అలవాటు లేదు : "నేను స్మోకింగ్ చేయను. ప్రోత్సహించను కూడా. అదొక ఆయుర్వేదిక్ బీడీ. అవి లవంగాల ఆకులతో తయారయ్యాయి. మొదట నాకు రియల్ బీడీ ఇచ్చారు. అది తాగగానే నాకు చాలా తలనొప్పి వచ్చేసింది. నా వల్ల కావడం లేదు ఏం చెద్దామని త్రివిక్రమ్‍కు చెప్పా. ఆ తర్వాత ఆలోచించి ఆయుర్వేదిక బీడీ అని సెట్ వాళ్లు ఏదో పట్టుకొచ్చారు. అది చాలా బాగానే అనిపించింది. అందుకే వాడాను. ఆ బీడీలను లవంగం ఆకులతో చేశారు. పుదీన ఫ్లేవర్‌తో ఉంది. అందులో పొగాకు అసలు లేదు. అది ఆయుర్వేదిక్" అని మహేశ్ బాబు పేర్కొన్నారు.

దీంతో అక్కడ ఉన్న సుమ సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఇదే హైలైట్ అని అన్నారు. ఆ వెంటనే శ్రీలీల మాట్లాడుతూ - బీడీలు మిగిలి పోతే మళ్లీ జాగ్రత్తగా ప్యాకెట్‍లో చుట్టి పెట్టేవారని చెప్పింది. దీంతో గుంటూరు కారంలో వాడిన బీడీల సీక్రెట్ రివీల్ అయిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్వయంకృషి డైలాగ్‍ : గుంటూరు కారం సినిమాలో చిరంజీవి 'స్వయంకృషి' సినిమా డైలాగ్‍ను ఉపయోగించడంపై కూడా మహేశ్ బాబు స్పందించారు. తనకు మెగాస్టార్​ అంటే చాలా గౌరవం అని, స్వయంకృషిలోని ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆ డైలాగ్ తాను సినిమాలో చెప్పినప్పుడు సుదర్శన్ థియేటర్లో అభిమానుల రియాక్షన్​ అద్భుతంగా ఉందని మహేశ్ చెప్పుకొచ్చారు.

ఇదే నాకు చివరి తెలుగు సినిమా - అందుకే అలా చేశా : మహేశ్ బాబు

రూ.100 కోట్లు దాటేసిన 'హనుమాన్' - అక్కడ 'సలార్​', 'బాహుబలి' రికార్డ్స్​ బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.