తెలంగాణ

telangana

ఓటీటీలోకి మిషన్ ఇంపాజిబుల్... సర్కారు వారి 'పాట' అప్డేట్!

By

Published : Apr 21, 2022, 7:15 PM IST

Updated : Apr 21, 2022, 7:52 PM IST

CINEMA UPDATES
CINEMA UPDATES ()

CINEMA UPDATES Telugu: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. సూపర్​స్టార్ మహేశ్​బాబు సర్కారు వారి పాట, తాప్సి మిషన్ ఇంపాజిబుల్ సహా పలు చిత్రాల సంగతులు ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

Sarkaru vaari paata update: సూపర్​స్టార్ మహేశ్​బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'. వరుస హిట్​లతో దూసుకెళ్తున్న మహేశ్​.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. కళావతి పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కూతురు సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్​గా మారింది. దీంతో సినిమా తర్వాతి అప్డేట్ కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే చిత్రబృందం త్వరలో మరో పాట విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మే 1న ఇందుకు సంబంధించిన అప్డేట్ రానున్నట్లు సినీ వర్గాల్లో టాక్!

mission impossible Taapsee OTT:తాప్సీ కీలక పాత్ర పోషించిన 'మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్‌ 29 నుంచి 'నెట్‌ఫ్లిక్స్‌'లో స్ట్రీమ్ కానుంది. తామెంతో ఫేమస్‌ అవ్వాలి, లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు చిన్నారుల కథ ఇది. థియేటర్లలో ఇటీవల విడుదలై అలరించింది. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హర్ష రోషన్‌, భాను ప్రకాశ్‌, జైతీర్థ అనే ముగ్గురు బాల నటులు వెండి తెరకు పరిచయమయ్యారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కే రాబిన్‌, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: దీపక్‌ యెరగరా.

Leharai motion poster:మరోవైపు, లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో నూతన నటీనటులు రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటించిన చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న లెహరాయి మోషన్ పోస్టర్​ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో లాంఛనంగా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు విజయ్ కుమార్ కొండ ముఖ్య అతిథిగా హాజరై లెహరాయి పోస్టర్​ను ఆవిష్కరించారు. గగన్ విహారి, రావురమేష్, నరేష్, అలీ, సత్యం రాజేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

లెహరాయి పోస్టర్

శేఖర్ మాస్టర్ సమర్పణలో..:1996లో ధర్మపురి గ్రామంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రం ధర్మపురి. శేఖర్ మాస్టర్ సమర్పణలో ప్రముఖ దర్శకుడు మారుతీ వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన జగత్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గగన్ విహారి, అపర్ణదేవి జంటగా నటించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కథానాయకుడు గగన్ విహారి, దర్శకుడు జగత్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్​లు ధర్మపురి విశేషాలను దర్శకుడు మారుతితో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ చూసేయండి..

ధర్మపురి చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ

ఇదీ చదవండి:

'మళ్లీ కలవలేమని నాన్న చెప్పారు.. హత్తుకొని ఏడ్చేశా!'

'దోస్తీ' వీడియో సాంగ్ రిలీజ్.. అప్పుడే లక్షల్లో వ్యూస్

Last Updated :Apr 21, 2022, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details