'దోస్తీ' వీడియో సాంగ్ రిలీజ్.. అప్పుడే లక్షల్లో వ్యూస్

author img

By

Published : Apr 21, 2022, 4:46 PM IST

Dosti song

RRR Movie Dosti: 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. కీరవాణి స్వరాలందించిన ఈ పాట.. విడుదలైన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారిపోయింది. ఇదివరకే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా, కొమ్మ ఉయ్యాల వీడియో సాంగ్స్​ను విడుదల చేశారు.

RRR Movie Dosti: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక సినిమా 'ఆర్​ఆర్​ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. వసూళ్ల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కీరవాణి స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని రామ్​ చరణ్​- తారక్​ మధ్య సాగే దోస్తీ పాటకు ఫిదా అయ్యారు అభిమానులు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు అందరినీ ఆకర్షించేలా ఉంది. విభిన్న ధృవాల మధ్య స్నేహం గురించి వివరించే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా కాలభైరవ ఆలపించారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందించారు. తాజాగా ఈ పాట పూర్తి వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. వీడియో సాంగ్ లక్షల్లో వ్యూస్​తో దూసుకెళ్తోంది. ఇదివరకే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా, కొమ్మ ఉయ్యాల పూర్తి వీడియో సాంగ్స్​ను మేకర్స్​ విడుదల చేశారు.

RRR collections: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా సినిమాలోని ఎన్టీఆర్‌, చరణ్‌ నటన యావత్‌ సినీ అభిమానుల్ని కట్టిపడేసింది. అల్లూరి సీతారామరాజు (నిప్పు) పాత్రలో రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ (నీరు)గా తారక్‌ నట విశ్వరూపం చూపారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఇటీవల రూ.1000 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

'మళ్లీ కలవలేమని నాన్న చెప్పారు.. హత్తుకొని ఏడ్చేశా!'

'ఆర్​సీబీ' కోసం 'కేజీఎఫ్' స్క్రీనింగ్.. సూర్య సినిమాపై జాంటీరోడ్స్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.