తెలంగాణ

telangana

Rage of bhola : మాస్​ మొగుడొచ్చాడు.. మెగా ర్యాప్ ఆంథమ్​ సాంగ్ చూశారా?

By

Published : Aug 5, 2023, 4:59 PM IST

Updated : Aug 5, 2023, 6:06 PM IST

Rage of bhola : మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' నుంచి 'Rage Of Bholaa' సాంగ్ రిలీజై మెగా అభిమానుల్లో ఊపు తెప్పిస్తోంది. మీరు చూశారా?

రేజ్ ఆఫ్ భోళా సాంగ్
Rage of bhola song

Chiranjeevi Bholashankar songs : మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా 'భోళా శంకర్'. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతోంది. మరో ఐదు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మరో కొత్త సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. తాజాగా 'Rage Of Bholaa' అనే మెగా ఆంథమ్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్​. ఈ సాంగ్ మొత్తం మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

MEGA RAP ANTHEM RageOfBholaa : ఈ పాటకు దర్శకుడు మెహర్ రమేష్, ఫిరోజ్ ఇజ్రాయిల్ కలిసి సాహిత్యం​ అందించారు. ర్యాపర్స్​ అసుర, ఫిరోజ్ కలిసి ఆలపించారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్​, విజువల్స్‌తో ఈ పాటను డిజైన్ చేశారు. 'ఒకటి రెండు మూడు వచ్చాడు అన్న సూడు.. స్టేట్ అంత వెతికి చూడు ఎదురు వచ్చేటోడే లేడు'.. అంటూ సినిమాలో చిరు పాత్రను ఎలివేట్ చేస్తూ లిరిక్స్ అందించారు. అలాగే మాస్​ మొగడు అంటూ పవర్ ఫుల్ యాక్షన్ విజువల్స్​ను చూపించారు. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది.

Bholashankar cast and crew : ఇక ఈ 'భోళా శంకర్' సినిమలో చిరంజీవితో పాటు తమన్నా భాటియా కూడా నటించింది. మహానటి కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిలిగా కనిపించింది. యువ నటుడు సుశాంత్, బ్రహ్మానందం, గెటప్ శ్రీను, హైపర్ ఆది, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదైలన గ్లింప్స్‌, సాంగ్స్​, టీజర్‌, ట్రైలర్‌ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్​ మీడియాలోనూ మంచి వ్యూస్​ను అందుకున్నాయి. ఈ ఆగస్టు 11న సినిమా వరల్డ్​ వైడ్​గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి.. బంగార్రాజు ఫేమ్​ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్‌ మూవీ 'బ్రో డాడీ' రీమేక్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో చిరుతో పాటు యంగ్ హీరో శర్వానంద్​ కూడా నటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

Actress Tamannaah : 'ఆ విషయంలో వయసు అసలు పట్టించుకోను.. ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్ లేవు'

'గ్యాంగ్​స్టర్​+ శంకర్​దాదా= 'భోళాజీ'​.. ఫుల్​ యంగ్​గా చిరు.. సినిమాకు అదే హైలెట్​'

Last Updated : Aug 5, 2023, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details