తెలంగాణ

telangana

బాలయ్య అనిల్​రావిపూడి సినిమా బడ్జెట్​ అన్ని కోట్లా

By

Published : Aug 18, 2022, 10:22 AM IST

Updated : Aug 18, 2022, 5:18 PM IST

Balakrishna Anilravipudi movie Budget బాలకృష్ణ అనిల్​రావిపూడి సినిమా బడ్జెట్​ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు.

Balakrishna Anil ravipudi movie budget Rs80 crores
బాలయ్య అనిల్​రావిపూడి సినిమా బడ్జెట్​ అన్ని కోట్లా

Balakrishna Anilravipudi movie Budget నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అనిల్​రావిపూడితో ఎన్​బీకే 108 మూవీ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు.

తాజాగా ఈ మూవీ బడ్జెట్​ గురించి ఓ ఇంట్రస్టింగ్​ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్​తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారట. దాదాపు రూ.80 కోట్లు ఖర్చుచేయనున్నట్లు టాక్​ వినిపిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్​లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన తీసినవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే. తొలిసారి బాలయ్య సినిమా కోసం రూ.80 కోట్ల బడ్జెట్ కోట్ చేశారు. కథ మీద నమ్మకంతో నిర్మాతలు అంత మొత్తం ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. అంతకుముందు బాలయ్య నటించిన 'అఖండ' సినిమాను రూ.65 కోట్ల బడ్జెట్​తో నిర్మించారట. ఎన్​బీకే 107 కోసం రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు మించి ఎన్​బీకే 108 కోసం ఖర్చు పెట్టబోతున్నారట.

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవలే ఓ స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్​ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు. బాలయ్యను ఎప్పుడూ చూడని విధంగా చూపించనున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. వీడియో ఇంట్రో బీజేఎం​ అదిరిపోయింది. తమన్​ స్వరాలు సమకూర్చనున్నారు. బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారట. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించనుందని తెలిసింది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించి... వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ చిత్రానికి 'ఐ డోంట్ కేర్' టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని విషయాలను తెలిపారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ చూడని విధంగా కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలానే బాలయ్య స్టైల్, మాస్ లుక్, డైలాగ్స్ అన్నీ ఉంటాయని.. వీటితో పాటు తను అనుకుంటున్న కోణం కూడా ఉంటుందని చెప్పారు.

ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ఎన్​బీకే 107 షూటింగ్​ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: బాలయ్య-అనిల్​రావిపూడి మూవీ అప్డేట్​​ వచ్చేసిందోచ్​.. ఇంట్రో బీజీఎం అదిరింది

Last Updated : Aug 18, 2022, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details