తెలంగాణ

telangana

హాస్పిటల్ నుంచి లాస్య డిశ్చార్జ్​.. రాగానే అలాంటి పని చేసి వైరల్​గా

By

Published : Sep 15, 2022, 11:14 AM IST

యాంకర్ లాస్య కోలుకున్నారు. ఇటీవల హాస్పిటల్ పాలైన ఆమె పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. వచ్చి రాగానే ఓ వీడియోను పోస్ట్​ చేశారు. అది కాస్త వైరల్​గా మారింది.

anchor lasya discharge
యాంకర్ లాస్య డిశార్జి

ఇటీవల కొద్ది రోజుల క్రితం లాస్య భర్త మంజునాథ్ అందరినీ ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. హాస్పిటల్ బెడ్​పై ఉన్న లాస్య ఫోటో షేర్ చేసిన ఆయన... ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టాడు. దీంతో లాస్యకు ఏమైంది అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే అది జ్వరం కారణంగా ఆమె ఆస్పత్రిలో డిశార్చి అయ్యారని తెలిసింది. దీంతో లాస్య త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు.

అయితే ఇప్పుడు లాస్య కోలుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఆమె పోస్ట్ చేసిన తాజా వీడియోనే నిదర్శనం. భర్త మంజునాథ్​తో రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ చేసి.. సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె మునుపటిలా ఉత్సాహంగా కనిపించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ కితాబు ఇస్తున్నారు. మరికొందరు ఆరోగ్యం మొత్తం సెట్​ అయినట్టేనా అని అడుగుతన్నారు. కాగా, గతంలో యాంకర్​గా పలు బుల్లితెర షోల్లో అలరించిన లాస్య.. ప్రస్తుతం వాటికి దూరం ఉంటున్నారు. యూట్యూబ్​తో పాటు ఇన్​స్టాలో మాత్రమే చురుగ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌2, బ్రహ్మాస్త్రం.. కలెక్షన్లలో రికార్డు ఎవరిదంటే?

ABOUT THE AUTHOR

...view details