తెలంగాణ

telangana

'పుష్ప' ఓటీటీ రిలీజ్.. అమెజాన్ ప్రైమ్​లో అప్పటినుంచే

By

Published : Jan 5, 2022, 1:21 PM IST

Updated : Dec 23, 2022, 4:49 PM IST

Pushpa OTT: బన్నీ 'పుష్ప' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

allu arjun pushpa ott
అల్లు అర్జున్ పుష్ప

Allu arjun pushpa movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ఓటీటీ రిలీజ్ ఖరారైంది. జనవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయమై అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా ఆడుతున్న ఈ సినిమా తెలుగులో రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అలానే హిందీలో దాదాపు రూ.75 కోట్ల కలెక్షన్లను చేరుకుంది.

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details