ETV Bharat / sitara

అల్లు అర్జున్ 'పుష్ప' స్టన్నింగ్: మహేశ్​బాబు

author img

By

Published : Jan 5, 2022, 7:11 AM IST

Mahesh allu arjun: 'పుష్ప' సినిమా అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు హీరో మహేశ్​బాబు. చిత్రబృందానికి కంగ్రాట్స్ చెప్పారు.

mahesh babu pushpa movie
పుష్ప మూవీ మహేశ్​బాబు

Mahesh babu pushpa movie: సూపర్​స్టార్ మహేశ్​బాబు 'పుష్ప' సినిమా చూశారు. హీరో అల్లు అర్జున్​, డైరెక్టర్ సుకుమార్​ను తెగ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు.

"పుష్ప'గా అల్లు అర్జున్ స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్.. స్టెల్లర్ యాక్టింగ్. సుకుమార్.. తన సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రాక్​స్టార్.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప' టీమ్​ మొత్తానికి కంగ్రాట్స్" అంటూ మహేశ్​బాబు ట్వీట్ చేశారు.

mahesh babu pushpa movie
పుష్ప సినిమాపై మహేశ్ ట్వీట్

'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్​బాబు. బ్యాంక్​ అప్పుల ఎగవేత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుందీ సినిమా. గతంలో మహేశ్​-సుకుమార్ కాంబినేషన్​లో 'వన్: నేనొక్కడినే' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.