తెలంగాణ

telangana

ఈ చిన్నారి ఇప్పుడు టాలెంటెడ్​ హీరోయిన్​.. ఎవరో గుర్తుపట్టగలరా

By

Published : Sep 13, 2022, 1:01 PM IST

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ప్రస్తుతం తన నేచురల్​ బ్యూటీ అండ్​ యాక్టింగ్​తో అభిమానులను సొంతం చేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Ishwarya rajesh childhood pic
ఐశ్వర్యరాజేశ్​

సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోస్ వైరల్​ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ హీరోయిన్​కు సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ చిన్నారి ప్రస్తుతం దక్షిణాదిలో ఓ విలక్షణ నటి. హీరోయిన్ కూడా. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నేచురల్ బ్యూటీ అండ్​ యాక్టింగ్​తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు తమిళం.. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. అంతేకాదు ఆమె తండ్రి ఒకప్పటి హీరో.. అలాగే ఆమె మేనత్త కూడా మంచి నటి.

ఇంతకీ ఆమె ఎవరంటే.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. 'టక్ జగదీష్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'భూమిక', 'రిపబ్లిక్', 'నవాబ్' చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె తండ్రి రాజేష్ కూడా నటుడే. 80లలో హీరోగా, సెకండ్ హీరోగా, సహయ నటుడిగా నటించి మెప్పించారు. అయితే ఐశ్వర్య ఎనిదేళ్లు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులను కోల్పోయింది. చైల్డ్ ఆర్టిస్ట్‏గా కెరీర్ ఆరంభించిన ఐశ్వర్య ప్రస్తుతం హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. త్వరలోనే డ్రైవర్​ జమున చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే మోహన్​దాస్​, పులిమాడా, ది గ్రేట్​ ఇండియన్ కిచెన్​, ధ్రువ నక్షత్రం సినిమాల్లో నటిస్తోంది.

ఐశ్వర్యరాజేశ్​
ఐశ్వర్యరాజేశ్​

ఇదీ చూడండి: ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఎన్ని చిత్రాలు వస్తున్నాయో

ABOUT THE AUTHOR

...view details