తెలంగాణ

telangana

Actor With No Box Office Clash : సోలోగా వచ్చి రికార్డులు బ్రేక్ .. 13 ఏళ్లుగా ఈ స్టార్​ హీరోకు అసలు పోటీనే లేదుగా!

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 10:55 AM IST

Actor With No Box Office Clash : దసరా సందర్భంగా తాజాగా 'భగవంత్​ కేసరి', 'లియో' సినిమాలు బాక్సాఫీస్​ వద్ద క్లాష్​ అయ్యాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతున్నాయి. ఇలా ఏదో ఒక సందర్భంలో స్టార్​ ​ హీరోల సినిమాల రిలీజ్ డేట్లు క్లాష్​ అయిన సందర్భాలను మనం చూసుంటాం. కానీ గత 13 ఏళ్లుగా ఓ నటుడు సోలోగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?

Actor With No Box Office Clash
Actor With No Box Office Clash

Actor With No Box Office Clash :2023 ఏడాదికిగాను అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​లోనూ ఎన్నో సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో భారీ నుంచి చిన్న బడ్జెట్​ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పండుగ సీజన్​తో పాటు వీకెండ్స్​ను దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు సినిమా రిలీజ్​ డేట్స్​ను ఫిక్స్ చేస్తారు. కొన్ని సార్లు అవి మిగతా చిత్రాల విడుదల తేదీలతో క్లాష్​ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

తాజాగా బాలకృష్ణ 'భగవంత్​ కేసరి', విజయ్​ 'లియో' దసరా సందర్భంగా ఒకే సారి పోటీ పడగా.. ఈ ఏడాది చివర్లో రానున్న షారుక్ ఖాన్​ 'డంకీ', ప్రభాస్​ 'సలార్​' కూడా క్రిస్మస్​ పండుగ సమయానికి ఇదే తరహాలో బరిలోకి దిగనుంది. మరోవైపు రణ్​బీర్​ కపూర్​ 'యానిమల్​' అలాగే విక్కీ కౌశల్​ 'శామ్​ బహాదుర్'​ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్​ ముందుకు రానున్నాయి. ఇలా ఏదో ఒక సినిమా మరోకదానితో పోటీ పడుతూనే ఉంటుంది.

అయితే ఇప్పటి వరకు ఎటువంటి క్లాష్​ లేకుండా సోలోగానే థియేటర్లలోకి వచ్చి సందడి చేసిన స్టార్ ఒకరున్నారు. ఆయన సినిమా విడుదలకు సిద్ధంగా ఉందంటే ఇక మిగతా వారంతా తమ రిలీజ్​ డేట్స్​ను మార్చుకోవాల్సిందే! అలా గత 13 ఏళ్లుగా ఈ స్టార్ హీరో​ సింగిల్​గా వచ్చి బాక్సాఫీస్​ను షేక్​ చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​. తాజాగా ఆయన లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'టైగర్​ 3' కూడా సోలోగానే థియేటర్లలో విడుదల కానుంది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబర్​ 12న విడుదల కానున్న ఈ సినిమాకు కాంపిటిషన్​గా ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాకపోవడం గమనార్హం.

Salman Khan Movies List : 2010లో విడుదలైన 'దబాంగ్'​ నుంచి ఇప్పటివరకు సుమారు 16 సినిమాలు క్లాష్​ లేకుండా విడుదలై బాక్సాఫీస్​ను షేక్​ చేశాయి. అందులో 'బాడీగార్డ్', 'ఏక్ థా టైగర్', 'దబాంగ్ 2', 'జై హో', 'కిక్', 'బజరంగీ భాయిజాన్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'సుల్తాన్', 'ట్యూబ్‌లైట్', 'టైగర్ జిందా హై', 'రేస్ 3', 'భారత్', 'దబాంగ్ 3', 'కిసీకా భాయ్ కిసికీ జాన్' లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే 'ట్యూబ్‌లైట్' , 'కిసీ కా భాయ్ కిసికీ జాన్'.. ఈ రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ సూపర్​ హిట్ టాక్​ అందుకున్నవే​.

స్టార్ హీరో కాదు.. కానీ ఈ యాక్టర్​​ చివరి మూడు సినిమాల కలెక్షన్లు రూ.1900 కోట్లు!

Highest Paid Actor In India : ఒకప్పుడు రూ.500... ఇప్పుడు రూ.200 కోట్ల రెమ్యునరేషన్.. ఆ స్టార్ హీరో ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details