తెలంగాణ

telangana

గవర్నమెంట్​ జాబ్​ వదిలేశా.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా: సోహైల్

By

Published : Dec 15, 2022, 12:26 PM IST

ఇంట్రెస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ కెరీర్​లో రాణిస్తున్న యంగ్​ హీరో​ సోహైల్. బిగ్​బాస్​తో క్రేజ్ దక్కించుకున్న అతడు.. తాను సూసైడ్​ ఎందుకు చేసుకోవాలనుకున్నాడో చెప్పాడు. ఇంకా తాను ప్రేమించిన అమ్మాయి ఎవరు? సినిమాల్లోకి ఎందుకు వచ్చాడు? వంటి విషయాలను తెలిపాడు. ఆ సంగతులు..

Alitho saradaga Syed Sohel
గవర్నమెంట్​ జాబ్​ వదిలేశా.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా: సోహైల్

గత ఏడాది బిగ్​బాస్​తో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న యాక్టర్​ సోహైల్. ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడనికి ప్రయత్నాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. తన కెరీర్​కు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఒకానొక సందర్భంలో సూసైడ్​ చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు. ఆ సంగతులు..

ఆ అమ్మాయిని ఇష్టపడ్డా.. 8వ తరగతిలో నేను చిరంజీవి గారి 'కొడితే కొట్టాలిరా..' పాటకు డాన్స్‌ వేశా. అప్పుడు ఓ నేపాలీ అమ్మాయి వచ్చి మాట్లాడింది. తనని ఇష్టపడ్డా. నేను అన్ని ఎగ్జామ్స్‌ కాపీ కొట్టి పాస్‌ అయ్యాను. డెస్ర్‌ వెనకాల రాసుకునే వాడిని. అలానే డిగ్రీ పరీక్షలు కూడా పాస్‌ అయ్యాను.

అందుకే సినిమాల్లోకి.. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ ప్రొగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. అలా ప్రోగ్రామ్స్‌కి వెళ్లినప్పుడు షూటింగ్స్‌ చూసేవాడిని. నేను మొదట చూసిన హీరోయిన్‌ తమన్నా. ఇంటర్‌ చదువుతున్నప్పుడు 'కొత్తబంగారు లోకం' సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసింది. ఫొటోస్‌ పంపించాను. సైడ్‌ క్యారెక్టర్‌లో నటించడానికి పిలిచారు. అలా నా సినీ ప్రయాణం మొదలైంది. హీరోగా నా మొదటి సినిమా 'మ్యూజిక్‌ మ్యాజిక్‌' హిట్‌ అవ్వలేదు. ఆ సినిమాకు మా నాన్న.. వాళ్ల ఫ్రెండ్స్‌ను తీసుకొని వెళ్లారు. కానీ థియేటర్‌లో షో వెయ్యలేదు. చాలా బాధపడ్డా. తర్వాత సీరియల్స్‌లో కూడా నటించా. రియాలిటీ షో వల్ల పేరు వచ్చింది. తాజాగా లక్కీ లక్ష్మణ్‌ అనే సినిమాలో నటించా. అది త్వరలో విడుదలకానుంది. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలో నటించాను. రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.

సూసైడ్​ చేసుకుందామనుకున్నా.. నేను చాలా సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ఓపెన్‌ హర్ట్‌ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడుగుతుండే వాళ్లు. ఎప్పుడు సెటిల్‌ అవుతావు? అని అడిగే వాళ్లు. నాకేమో సినిమాలంటే ఇష్టం. అప్పటికీ రెండు సినిమాల్లో నటించా కానీ హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లోనేమో ఉద్యోగమంటూ ఒత్తిడి.. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సూసైడ్‌ ఆలోచన వచ్చింది. గవర్నమెంట్‌ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా నా గమ్యం ఇది కాదు అని వెనక్కి వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. కానీ నేను ఇలా ఉండడానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు.

ఇదీ చూడండి:ఇడియట్​​ హీరోయిన్​కు గట్టి వార్నింగ్​ ఇచ్చిన పూరి జగన్నాథ్​.. షూటింగ్ స్పాట్​లోనే..

ABOUT THE AUTHOR

...view details