ETV Bharat / entertainment

ఇడియట్​​ హీరోయిన్​కు గట్టి వార్నింగ్​ ఇచ్చిన పూరి జగన్నాథ్​.. షూటింగ్ స్పాట్​లోనే..

author img

By

Published : Dec 15, 2022, 10:53 AM IST

ఇడియట్ సినిమా హీరోయిన్​కు గట్టి వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్​. ఏం జరిగిందంటే..

Purijagannadh gave warning to rakshitha
ఇడియన్​ హీరోయిన్​కు గట్టి వార్నింగ్​ ఇచ్చిన పూరి జగన్నాథ్​.. షూటింగ్ స్పాట్​లోనే..

'ఇడియట్‌' మూవీ షూటింగ్‌ సమయంలో హీరోయిన్​ రక్షితకు గట్టి వార్నింగ్‌ ఇచ్చానట్లు గుర్తుచేసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్​. అయితే తాను తిట్టిన తర్వాత ఆమె చెప్పిన సమాధానం విని నవ్వు ఆగలేదని అన్నారు. 'పూరి మ్యూజింగ్స్‌' పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా 'రియాక్షన్స్‌'పై మాట్లాడారు.

''జీవితంలో చాలా జరుగుతాయి.. జరుగుతుంటాయి. వాటి మీద మనకు ఎలాంటి కంట్రోల్‌ ఉండదు. మన చేతిలో ఉండేది ఒక్కటే, రియాక్షన్స్‌ ఇవ్వడమే. ఏం జరిగితే ఎలా రియాక్ట్‌ అవుతున్నామనేది చాలా ముఖ్యం. ఎంత కష్టమొచ్చినా, ఏ సమస్య వచ్చినా మన రియాక్షన్‌ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి. అరిచి గోల చేసేయడం, తల గోడకేసి కొట్టుకోవడం వాటి వల్ల అస్సలు ఉపయోగం లేదు. నీ ఎమోషన్స్‌ వల్ల, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటావు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. నీ ప్రతిస్పందన వల్ల వచ్చే సమస్యే అసలు సమస్య. మనం మనుషులకు ఎలా రియాక్ట్‌ అవుతున్నాం? సంఘటనలకు ఎలా రియాక్ట్‌ అవుతున్నాం? లేదా ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి ఏం సమాధానం ఇస్తున్నామనేది చాలా ముఖ్యం. బ్యాలెన్డ్స్‌గా ఆలోచించడం, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏ మాట్లాడినా, మన భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకొని మాట్లాడాలి''

Purijagannadh
ఇడియన్​ హీరోయిన్​కు గట్టి వార్నింగ్​ ఇచ్చిన పూరి జగన్నాథ్​.. షూటింగ్ స్పాట్​లోనే..

''మీరు విపరీతమైన కోపంలో ఉంటే అస్సలు సమాధానం చెప్పొద్దు. చాలా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోండి. చాలా సార్లు ఏమీ చేయకపోవడం, భావాలను వ్యక్తపరచకపోవడం ఇంకా మంచిది. అవతల మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ సమాధానం ఇవ్వండి. వాడికి ఏం చేయాలో తెలియదు. 'ఇడియట్‌' షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒక సీన్‌లో రక్షిత సరిగా చేయడం లేదు. అది ఏడ్చే సీన్‌. కానీ, పగలబడి నవ్వుతోంది. నాకు కోపం వచ్చింది. సెట్‌లో అందరూ వింటుండగా, 'రక్షిత నువ్వు ఫోకస్‌ చేయడం లేదు. తర్వాతి సినిమాలో నీకు క్యారెక్టర్‌ రాయను' అని చాలా గట్టిగా చెప్పా. తను వెంటనే 'రాయి.. రాయకపోతే చంపేస్తాను. నీ తర్వాతి పది సినిమాలు నేనే చేస్తా. ఇప్పుడు నీకు ఏం కావాలో సరిగా చెప్పి చావు' అని అన్నది. అంతే, ఆ అమ్మాయి స్పందనకు సెట్‌లో అందరూ క్లాప్స్‌కొట్టారు. ఆ మాటలకు నాకు కూడా నవ్వు ఆగలేదు. నేను ఊహించని సమాధానం అది. ఆ అమ్మాయి మీద కోపం మొత్తం పోయింది''

''నేను అన్న మాటలకు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. లేదా అలిగి రెండో రోజూ షూటింగ్‌కు రాకపోవచ్చు. కానీ, తను అలా చేయలేదు. మన రియాక్షన్స్‌ వల్ల లైఫ్‌లో చాలా విసుగు, చికాకులను తగ్గించుకోవచ్చు. ఇవికాకుండా సోషల్‌మీడియాలో ఎవరెవో పోస్టులు పెడతారు. ప్రతి దానికీ మనం స్పందించాల్సిన అవసరం లేదు. అలాగే న్యూస్‌... ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్‌గా రియాక్ట్‌ అయి, వాదించడం అవసరమా? మనం పనికి వచ్చే వాటికే స్పందిద్దాం. నవ్వుతూ చెప్పే సమాధానం, లేకపోతే, ఏ సమాధానం చెప్పకుండా మీరు నవ్వే చిన్న చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది'' అని పేర్కొన్నారు.

Purijagannadh
బరువు పెరిగిన తర్వాత హీరోయిన్​ రక్షిత

ఇదీ చూడండి: ఉర్రూతలూగిస్తున్న 'సుగుణ సుందరి' సాంగ్​.. బాలయ్య-శ్రుతి డ్యాన్స్​ అదరగొట్టేశారుగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.