తెలంగాణ

telangana

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

By

Published : Jan 6, 2023, 11:20 AM IST

Young Man Cut Young Woman Throat: ప్రేమ పేరుతో రెండు నెలలుగా వెంటపడుతున్నాడు. పలుమార్లు యువతి తండ్రి ఆ యువకుడిని హెచ్చరించాడు. అయినా బుద్ధి మార్చుకోని ఆ యువకుడు.. అర్ధరాత్రి యువతి ఇంటికి వచ్చి.. ఆమె గొంతు కోశాడు. అడ్డువచ్చిన ఆమెతల్లీ, చెల్లిని కూడా గాయపరిచాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

crime
crime

Young Man Cut Young Woman Throat: ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కొండ్రుప్రోలులో దారుణం చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంట పడుతోన్న యువకుడు రాజులపాటి కల్యాణ్‌.. గురువారం అర్ధరాత్రి దాటాక యువతి ఇంటికి వెళ్లి గొంతు కోశాడు. అడ్డొచ్చిన యువతి చెల్లెలు, తల్లిపై చాకుతో దాడి చేశాడు.

దారుణం.. అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లి గొంతు కోసిన ప్రేమోన్మాది

వారిని గమనించిన స్థానికులు రక్తపుమడుగులో పడి ఉన్న ముగ్గురిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కల్యాణ్‌ను గతంలో పలుమార్లు యువతి తండ్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన తాడేపల్లిగూడెం గ్రామీణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"గతంలోనూ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అప్పుడు మా నాన్న పెద్దమనుషులతో వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే వినలేదు. గడ్డివాములకు నిప్పంటించి.. గొంతు కోసి పారిపోయాడు". - యువతి సోదరుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details