తెలంగాణ

telangana

Sexual harassment: అశ్లీల వీడియో వైరల్.. నిందితుడిని చితకబాదిన మహిళలు

By

Published : Aug 8, 2022, 3:41 PM IST

Sexual harassment: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కంఠమనేని ఫంక్షన్ హాల్ యజమాని వేణుపై స్థానిక మహిళలు, మరికొందరు కలిసి దాడి చేశారు. ఫంక్షన్​హాల్​లో ఉన్న యజమానిని బయటకు లాక్కొచ్చి... విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు. అసలేం జరిందంటే..?

Attack
Attack

Sexual harassment: అశ్లీల వీడియో తీసి వైరల్‌ చేసినందుకు పెనుగంచిప్రోలులోని కంఠమనేని ఫంక్షన్‌ హాలు యజమాని వేణుగోపాల్‌పై బాధిత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వివాహితతో సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా అమర్చిన సెల్‌ఫోన్‌లో వేణుగోపాల్‌ వీడియో తీశాడు. దానిని బయటపెడతానని చాలాకాలం బెదిరించాడు. ఆమెను అనేక సార్లు లైంగికంగా వేధించాడు. ఇటీవల ఆ వీడియోను ఇతరులకు పంపి ఆమె పరువుకు విఘాతం కలిగించాడు.

ఆ విషయమై అతన్ని ప్రశ్నించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆమె ఫంక్షన్‌ హాలుకు వెళ్లగా... వారిపై వేణుగోపాల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఆగ్రహం చెందిన వారు అతనిపై దాడి చేశారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి అతన్ని స్టేషన్‌కు తీసుకువచ్చారు. గాయపడ్డ వేణుగోపాల్‌ని 108 వాహనంలో చికిత్స కోసం నందిగామ ఆసుపత్రికి పంపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details