తెలంగాణ

telangana

ప్రేమించి పెళ్లాడింది.. ఇప్పుడు భర్త గొంతు కోసేసింది.. ఏం జరిగిందంటే..!

By

Published : Oct 13, 2022, 3:41 PM IST

Wife cut her husband's throat: అప్పటికే అమెకు వివాహమైంది.. ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. భర్త, పిల్లల్ని వదిలి వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు. అయితే గత కొంత కాలంగా అమెను భర్త పట్టించుకోకపోవడంతో తరచూ గొడవలు జరిగేవి. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భర్తపై కోపం పెంచుకుంది. దీంతో ఇద్దరు బైక్​పై వెళ్లి వస్తుండగా వెనకాల కూర్చున్న ఆమె భర్త గొంతు కోసింది. ఈఘటన ఏపీ నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Wife tried to kill her husband
Wife tried to kill her husband

Wife tried to kill her husband: ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరులో దారుణం జరిగింది. బైక్​పై వెళ్తుండగా భర్త గొంతును భార్య కోసేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. సౌత్ మోపూర్​కు చెందిన ప్రసన్న కుమార్, లక్ష్మీ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలున్న లక్ష్మీప్రసన్న భర్తను, పిల్లలను వదిలేసి ప్రసన్నకుమార్​ను వివాహం చేసుకుంది.

వీరికి ఓ కుమారుడు పుట్టగా.. ఇటీవల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భర్తపై కక్ష పెంచుకుంది. నెల్లూరు నుంచి బైక్​పై సౌత్ మోపూరుకు వెళ్తుండగా మొగళ్లపాళెం స్టేడియం సమీపంలో ప్రసన్నకుమార్ గొంతు కోసింది. గుర్తించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మీ ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details