తెలంగాణ

telangana

బట్టలు ఉతకడానికి వెళ్లి... విగతజీవులుగా మారిన ఇద్దరు మహిళలు

By

Published : Mar 23, 2022, 1:01 PM IST

Women died in Bhadradri: బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మల్లన్న వాగులో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. అందులో చుట్టపుచూపుగా వచ్చిన యువతి విగతజీవిగా మారడం స్థానికులను కలిచి వేసింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

Women died in Bhadradri
ఇద్దరు మహిళలు మృతి

Women died in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి మల్లన్న వాగు వద్దకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందారు. రోళ్లగడ్డకు చెందిన దుగ్గి స్వరూప(45), ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలకు చెందిన చాపల మౌనిక(18)లు ఈ ఘటనలో మరణించారు.

చుట్టపుచూపుగా వచ్చి..

రోళ్లగడ్డకు చెందిన స్వరూప ఇంటికి మేనకోడలు అయినా మౌనిక వచ్చింది. ఇద్దరు కలిసి బట్టలు ఉతకడానికి మల్లన్న వాగు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు మౌనిక వాగులో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు స్వరూప యత్నించడంతో ఇద్దరు నీట మునిగి చనిపోయారు. ఈ ఘటనతో రోళ్లగడ్డలో విషాదం అలుముకుంది. చుట్టపుచూపుగా వచ్చిన యువతి అకాల మరణం అందరిని కలిచి వేసింది.

ఇదీ చదవండి:Fire Accident in Timber Depot : టింబర్‌ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details